ఏపీలో భారీ వర్షాలు.. ఈ 8 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్! అస్సలు బయటికి రావద్దు.. !

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వర్షాల కారణంగా భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నదులు, చెరువులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో.. జనజీవనం మొత్తం అస్తవ్యస్తంగా మారింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అంతేకాకుండా.. ఈదురు గాలులకు పెద్దపెద్ద చెట్లు విరిగిపడి కొండచరియలు విరిగిపడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ తుపాను ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని అంటున్నారు. ఏపీలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. ఏపీలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.

Related News

ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, గుంటూరు, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలు ఉన్నాయి. అలాగే, ఈరోజు (శనివారం, ఆగస్టు 30) రాత్రి 9:30 గంటల నుండి రేపు ఉదయం 9:30 గంటల వరకు ఆ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్,

ఈ గాలి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాళ్లలోతు వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నగర రోడ్లపైనే కాకుండా జాతీయ రహదారులపై కూడా వర్షం నీరు నదిలోకి చేరుతోంది. మరోవైపు బలమైన ఈదురు గాలులు వీస్తున్నందున మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దీంతో పాటు కాల్వలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు పడిపోయిన విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని వాతావరణ శాఖ అధికారులు కోరారు. శనివారం అర్ధరాత్రి విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Guntur – Vijayawada Hi Way