వేడిగాలులు: ఉత్తరాది రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటాయి.
రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని మంగేష్‌పూర్‌లో 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు ఆ రికార్డును అధిగమించి మహారాష్ట్రలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నాగ్‌పూర్‌లో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో వడదెబ్బకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బీహార్‌లో 32 మంది,
- ఒడిశాలో 10 మంది,
- జార్ఖండ్‌లో 5 మంది,
- రాజస్థాన్‌లో 5 మంది,
- ఉత్తరప్రదేశ్‌లో ఒకరు,
- ఢిల్లీలో ఒకరు మరణించారు.