హార్ట్ అటాక్ తో మృతి, కానీ క్లెయిమ్ తిరస్కారం.. ఇన్సూరెన్స్ లో ఈ తప్పు మీరూ చేస్తున్నారా?

ఇన్సూరెన్స్ తీసుకుంటే కుటుంబ భవిష్యత్తు సేఫ్ అనుకుంటున్నారా? అసలు క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకూడదు అంటే మీరు ఏ తప్పులు చేయకూడదు? ఇటీవల సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పు ఇచ్చింది. పాలిసీ హోల్డర్ ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెడితే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ తిరస్కరించొచ్చు అని స్పష్టం చేసింది. ముఖ్యంగా, మద్యపానం అలవాటును దాచిపెడితే, మరణ కారణం మద్యం సంబంధం లేకపోయినా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇన్సూరెన్స్ క్లెయిమ్ వివాదం – అసలు ఏం జరిగింది?

ఓ వ్యక్తి 2013లో LIC సంస్థ నుంచి ‘జీవన్ ఆరోగ్య’ పాలసీ తీసుకున్నారు. అయితే, అప్లికేషన్ ఫారమ్‌లో తనకు ఎక్కువగా మద్యం సేవించే అలవాటు ఉందని చెప్పలేదు. పాలసీ తీసుకున్న ఏడాదికే అతనికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చి హరియాణాలోని హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నాడు. నెల రోజుల తర్వాత హార్ట్ అటాక్‌ వచ్చి మరణించాడు.

ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఎందుకు తిరస్కరించింది?

  •  అతని భార్య హాస్పిటల్ ఖర్చులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ దాఖలు చేసింది
  •  LIC సంస్థ “ఆయన మద్యం సేవించే అలవాటు దాచిపెట్టారు” అంటూ క్లెయిమ్ తిరస్కరించింది
  •  LIC రూల్స్ ప్రకారం వ్యక్తి స్వంత అలవాట్ల వలన కలిగిన వ్యాధులకు కవరేజీ ఉండదు
  •  మద్యం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కూడా పాలసీ కవరేజ్‌లో ఉండవని LIC తెలిపింది

కస్టమర్ కోర్టు – సుప్రీంకోర్టు తీర్పులు

  • జిల్లా వినియోగదారుల కోర్టు బాధితురాలి పక్షాన తీర్పు ఇచ్చి LIC రూ.5.21 లక్షలు చెల్లించాలని ఆదేశించింది
  • రాష్ట్ర, జాతీయ వినియోగదారుల కమిషన్ కూడా అదే తీర్పును మద్దతిచ్చాయి
  •  LIC సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంది

సుప్రీంకోర్టు LICకు అనుకూలంగా తీర్పు

జస్టిస్ విక్రం నాథ్, సందీప్ మెహతా బంచ్ వినియోగదారుల కోర్టుల తీర్పులను రద్దు చేసింది.

Related News

  • ఇది సాధారణ పాలసీ కాదు, ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్
  •  మద్యం కారణంగా వచ్చే వ్యాధులు ఒక్కరోజులో రాకపోవు
  •  పాలసీ హోల్డర్ సమాచారం దాచిపెట్టారు కాబట్టి LIC క్లెయిమ్ తిరస్కరించడం సమంజసం
  •  అయితే, మృతుడి భార్యకు ఇప్పటికే ఇచ్చిన రూ.3 లక్షలు వెనక్కి తీసుకోమని ఆదేశించలేదు

ఫైనల్ వెర్డిక్ట్ – ఇన్సూరెన్స్ తీసుకునే ప్రతి ఒక్కరూ జాగ్రత్త

  • పాలసీ తీసుకునేప్పుడు అసలు విషయాలు దాచిపెట్టకండి
  • మీ ఆరోగ్య పరిస్థితిని సరైన విధంగా డిక్లేర్ చేయకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది
  •  పదేపదే మద్యం, పొగత్రాగడం అలవాటు అయితే, ఇన్సూరెన్స్ కంపెనీలు దీన్ని పెద్దగా తీసుకుంటాయి

ఈ విషయాలు ముందే తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వొచ్చు. ఆలస్యం కాకముందే మీ పాలసీని రివ్యూ చేసుకోండి