మీ చేతిలో రూ.22,50,000 ఉన్నాయ్. దీన్ని మీరు దీర్ఘకాలిక పెట్టుబడిగా అంటే 15 ఏళ్లకు పెట్టాలనుకుంటున్నారు. అలాంటప్పుడు చాలామంది ముందుగా ఆలోచించే రెండు పాపులర్ ఆప్షన్లు – PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) మరియు మ్యూచువల్ ఫండ్ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్. రెండింటికీ తమతమ ఫీచర్లు ఉన్నాయి. కానీ రిటర్న్స్ పరంగా చాలా తేడా ఉంటుంది.
ఇప్పుడు చూద్దాం, ఈ రెండింటిలో ఏది మనకు ఎక్కువ లాభం ఇస్తుందో. అలాగే ట్యాక్స్ ప్రయోజనాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాం.
PPF – భద్రతను కోరుకునే వారికి సురక్షిత ఆప్షన్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది భారత ప్రభుత్వం నడిపే ఒక పొదుపు పథకం. ఇందులో వార్షిక వడ్డీ రేటు ప్రస్తుతం 7.1%. ఈ వడ్డీ ప్రభుత్వమే నిర్ధారిస్తుందని గమనించండి. అంతేకాకుండా, మీరు ఇందులో పెట్టే డబ్బుపై Income Tax లో Section 80C కింద మినహాయింపు కూడా పొందవచ్చు. దీని వడ్డీ మరియు maturity డబ్బు రెండూ ట్యాక్స్ ఫ్రీ కావడం గొప్ప లాభం.
Related News
కానీ ఇందులో ఒక పెద్ద పరిమితి ఉంది. ఒక్క సంవత్సరం గరిష్ఠంగా రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టచ్చు. అంటే మీరు ఒకేసారి రూ.22.5 లక్షలు PPFలో వేయలేరు. మీరు ఈ మొత్తాన్ని ప్రతి ఏడాది రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లపాటు వేయాలి.
15 ఏళ్ల తర్వాత మీరు పొందే మొత్తం ఇలా ఉంటుంది:
మీ మొత్తం పెట్టుబడి రూ.22,50,000. దీనిపై వడ్డీగా రావడం రూ.18,18,209. మొత్తం maturity amount రూ.40,68,209.
అంటే మీరు పెట్టిన డబ్బుతో పోలిస్తే మీకు దాదాపు డబ్బు డబుల్ అవుతుంది. కానీ ఇది ఒక రకంగా స్థిరమైన పద్ధతిలో ఉంటుంది. అంటే మార్కెట్ పెరిగినా, పడినా మీ వడ్డీ రేట్ మారదు. ఇది లాంగ్ టర్మ్‌లో భద్రతను కోరుకునే వారికి చాలా మంచిది.
Mutual Fund Lump Sum
మ్యూచువల్ ఫండ్ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీరు మీ మొత్తం రూ.22.5 లక్షలను ఒకేసారి ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం. దీని గొప్పతనం ఏంటంటే, మీరు మొత్తం డబ్బు మొదటి రోజునే పెట్టడంవల్ల పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్రారంభం అవుతుంది. రోజురోజుకీ మీ డబ్బు పెరుగుతూ ఉంటుంది.
ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్ సగటున 12% వృద్ధి రేటు ఇస్తాయని గత రికార్డ్స్ చెబుతున్నాయి. అదే రేటుతో 15 ఏళ్ల తర్వాత మీరు పొందే లాభం అంచనాలు ఇలా ఉంటాయి:
మీ మొత్తం పెట్టుబడి రూ.22,50,000. అంచనా లాభం రూ.1,00,65,523. మొత్తం maturity value రూ.1,23,15,523.
అంటే ఇది PPFతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలదు. కాని దీని లోపల ఒక రిస్క్ ఉంటుంది. మార్కెట్ చలనాలు దీనిపై ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు మార్కెట్ పడిపోయినప్పుడు మీ NAV (నెట్ ఆస్తి విలువ) తక్కువగా ఉండొచ్చు. కానీ 15 ఏళ్ల లాంగ్ టర్మ్‌లో మార్కెట్ సాధారణంగా ఎదుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.
ట్యాక్స్ పరంగా ఏది మంచిది?
PPFలో మీరు పొందే వడ్డీ, మేచ్యూరిటీ మొత్తం ట్యాక్స్ ఫ్రీ. ఇది చాలా పెద్ద ప్రయోజనం. పైగా ప్రతి ఏడాది మీరు వేసే డబ్బుపై 80C కింద మినహాయింపు కూడా లభిస్తుంది.
మ్యూచువల్ ఫండ్ లాభాలపై మాత్రం ట్యాక్స్ ఉంటుంది. కానీ మీరు పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఒక ఏడాది తర్వాత వచ్చే లాభాలు అంటే లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్స్ పై మాత్రమే 10% ట్యాక్స్ ఉంటుంది. అటూ Income Tax మినహాయింపులు మాత్రం ఉండవు. అయితే mutual fund returns ఎక్కువగా ఉండడం వల్ల, ఈ tax కూడా ఎక్కువగా అనిపించదు.
మరి ఏది ఎంపిక చేయాలి?
మీరు రిస్క్ లేకుండా భద్రతగా పెరుగుతున్న డబ్బును కోరుకుంటే PPF మంచిది. ఇది government backed కాబట్టి మీ డబ్బు 100% సురక్షితంగా ఉంటుంది. కానీ returns పరంగా పరిమితి ఉంటుంది.
మీకు కొంత రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటే, మంచి mutual fund లో లంప్ సమ్ పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బు 15 ఏళ్లలో మూడు రెట్లు అయినా అవుతుంది. ఇది సంపద సృష్టించడం కోసం అత్యుత్తమ మార్గం.
అసలు రూ.22.5 లక్షలు పెట్టి దాదాపు రూ.1.23 కోట్లు వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకుంటారా? ఒకేసారి పెట్టుబడి పెట్టి మీ భవిష్యత్‌ను బంగారంగా మార్చుకునే ఇది సూపర్ ఛాన్స్. ఒక్కసారి ఈ లెక్కలు చూసిన తర్వాత మీరు పథకం మార్చుకోవచ్చు.
సరైన ప్లాన్‌తో ముందుకు వెళ్లాలి. తక్కువ రిటర్న్స్ కి ఓకే అనుకుంటే PPF తీసుకోండి. ఎక్కువ రిటర్న్స్, ఫ్రీడమ్, మరియు నిజమైన సంపద కోసం మ్యూచువల్ ఫండ్‌ల వైపు అడుగు వేసే టైం ఇది.
మీ నిర్ణయమే మీ రిటైర్మెంట్ ను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ప్లాన్ చేయకపోతే – రేపు చింతించక తప్పదు