భార్యా భర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో కలిసి నడిస్తేనే ఆ జీవితం సంతోషంగా సాగుతుంది. ఇందులో ఎలాంటి ఒడుదుడుకులు వచ్చినా ఇద్దరూ ఒకే మాటమీద ఉండి సంసారాన్ని నడిపించాలి. ఇందులో ఏకాస్త లోపం జరిగినా కూడా సంసారంలో కలతలు తప్పవు. అయితే భార్యాభర్తలు ఒకరికొకరు అనుబంధంతో స్నేహంగా, ప్రేమతో ఉండాలి.
ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు. అలాగే కొన్ని విషయాలను ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిది. ఈ పరిస్థితిలో, ఏ భర్త కూడా తన భార్యతో పంచుకోకూడని కొన్ని విషయాలను చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలున్నాయి. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మాత్రం దీంతో బంధం బలహీనపడడమే కాకుండా ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవేమిటంటే..
అనుమానం గురించి
Related News
ఏ స్త్రీ తన భర్త నుండి చిన్న అనుమానాన్ని కూడా సహించదు. అతనికి భార్య మీద ఈ ఏదన్నా అనుమానం వచ్చిన వెంటనే, ఈ విషయాన్ని నేరుగా అడగకూడదు. బంధం పాడవకుండా చూసుకోవాలి. అసలు విషయం ఏమిటో నెమ్మదిగా రాబట్టాలి.. కొన్ని కొన్ని అడగకుండా ఉండటమే మంచిది.. మరీ పెద్ద పెద్ద అనుమానాలు అయితే తప్ప..
ఆదాయాలు
తెలివైన వ్యక్తి తన అసలు సంపాదనను భార్యకు చెప్పకూడదు. చాణక్య నీతి ప్రకారం, భార్య తెలివైనది కాకపోతే, ఆమె తన భర్త తక్కువ సంపాదిస్తున్నప్పుడు భర్తకి గౌరవము ఇవ్వదు. దాని గురించి ఎప్పుడూ తనని తక్కువ చేస్తూ ఉంటుంది. ఒక వేళ సంపాదన ఎక్కువ ఉంటె అదే సమయంలో చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది.
దానాలు
దానం అంటే చేసే వాడికి తప్ప మరెవరికీ తెలియకూడదని అంటారు. ఒక చేత్తో చేసిన దానం మరో చేతికి తెలియకూడదని చెప్పారు. ఎందుకంటే భార్య అత్యాశతో ఉంటే, దానం గురించి గొడవ పడవచ్చు. కాబట్టి భార్యాభర్తలు తాము చేసిన దానాలను ఒకరికొకరు చెప్పుకోకపోవటం మంచిది .
బలహీనత
భర్త తన బలహీనత గురించి ఎప్పుడూ భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే చాలా సార్లు ఆడవారు తెలియకుండానే ఇతరుల దగ్గర సెహెప్పేస్తూ ఉంటారు . ఇవన్నీ భార్యాభర్తలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోకూడని విషయాలు. సంసారానికి గుట్టు చాలా అవసరం. గుట్టులేని సంసారం అభాసుపాలు పాలవుతుందని అంటారు. అలాగే చెప్పే విషయంలో నిజాయితీ, నమ్మకం సంపాదించుకునేలా ఉండాలి. ఇదే ఆ సంసారాన్ని ఎప్పటికి నిలుపుతుంది.