ఇటీవల హైదరాబాద్ లోని మీర్ పేట్ లో జరిగిన ఒక మహిళ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భర్త భార్యను దారుణంగా చంపి మృగంలా ప్రవర్తించాడు. భర్త గురుమూర్తి వెంకట మాధవిని హత్య చేసి, ముక్కలుగా నరికి, కుక్కర్ లో ఉడికించి, ఆపై పౌడర్ చేసి చెరువులో పడేశాడు. ఈ దారుణ సంఘటన పోలీసులకు సవాలుగా మారింది. పోలీసులు ఇప్పటికే గురుమూర్తిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే, ఈ హత్య కేసులో సంచలనాత్మక విషయాలు బయటకు వస్తున్నాయి. గురుమూర్తితో పాటు మరికొందరు ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వెంకట మాధవిని గురుమూర్తి ఒంటరిగా చంపలేదని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురుమూర్తి, మరో ముగ్గురు కలిసి ఆమెను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలో ఒక మహిళతో పాటు మరో ఇద్దరు పాత్ర పోషించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కోర్టు అనుమతితో పోలీసులు గురుమూర్తిని కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు గురుమూర్తిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. గురుమూర్తికి సహాయం చేసిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గురుమూర్తి కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. నిజం బయటపడటానికి అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.