Gurukul Entrance Exam : ఫిబ్రవరి 23న గురుకులాల ప్రవేశపరీక్ష – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్: రాష్ట్రంలోని ఐదు నుండి తొమ్మిదో తరగతి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
గ్రామాలు, నియోజకవర్గాలు, పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని ఆయన అన్నారు.
సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన వాల్ న్యూస్ పేపర్‌ను శనివారం ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నాణ్యమైన విద్య మరియు పోషకమైన ఆహారం కోసం డైట్ ఛార్జీలను 40% మరియు కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచినట్లు ఆయన వివరించారు.