
స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని చూస్తున్నారా? బ్యాటరీ ఎక్కువ ఉంటే ధర కూడా ఎక్కువగా ఉంటుందనుకుంటున్నారా? అయితే మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన వివో టీ4 లైట్ ఫోన్‌ను ఒకసారి చూడండి. ఇది మీ అంచనాలన్నింటినీ తలకిందులు చేసే విధంగా ఉంటుంది.
వివో టీ4 లైట్ ఫోన్లో 6000ఎంఏహెచ్ బడా బ్యాటరీ ఉంది. దీని వల్ల మీరు సాయంత్రం వరకు కాదు, రెండు రోజుల వరకూ కూడా ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఇంకా, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఛార్జింగ్ వేగంగా అయిపోతుంది.
ఈ ఫోన్ 6.4 ఇంచుల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే చూడముచ్చటగా ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్న ఈ ఫోన్లో మీరు మీ పాత ఇయర్‌ఫోన్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంతేకాదు, ఇది వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కూడా. IP64 ప్రొటెక్షన్ కలిగివుంది.
[news_related_post]ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. ఇది ఫోన్ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్ 4GB లేదా 6GB ర్యామ్, 128GB లేదా 256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మీరు కావాలంటే 1TB వరకూ స్టోరేజ్ పెంచుకోవచ్చు.
కెమెరా విషయానికి వస్తే, ఇది చాలా ఇంట్రెస్టింగ్. వెనుకవైపు 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ లవర్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇది చక్కగా పని చేస్తుంది.
ఈ ఫోన్ కొత్తగా వచ్చిన ఆండ్రాయిడ్ 15 ఫన్‌టచ్ ఓఎస్‌పై పనిచేస్తుంది. ఫోన్ ఫాస్ట్‌గా, స్మూత్‌గా రన్నవుతుంది. ఇది ప్రిజం బ్లూ, టిటానియం గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ ధర కేవలం ₹10,999 మాత్రమే. ఇది అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇంత ఎక్కువ ఫీచర్స్, బెటరైన బ్యాటరీ, మంచి బ్రాండ్ ఫోన్, తక్కువ ధర – ఇంకా ఏం కావాలి? స్టాక్ లిమిటెడ్‌గా ఉండొచ్చు. ఆలస్యం చేయకండి.