ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి అనేక పథకాలను అందిస్తోంది. అందులో ఒకటి మహిళా ఉద్యమి యోజన. ఈ పథకం ద్వారా మహిళలు తక్కువ వడ్డీ రేటుతో ₹10 లక్షల వరకు ఋణం తీసుకుని తమ స్వంత వ్యాపారం ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మహిళా ఉద్యమి యోజన అంటే ఏమిటి?
- స్వంతంగా చిన్న, మధ్య తరహా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే మహిళలకు ₹10 లక్షల వరకు లోన్ అందించే పథకం.
- ఈ పథకాన్ని స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (SIDBI) ద్వారా అందిస్తున్నారు.
- లోన్‌పై అత్యల్ప వడ్డీ ఉంటుంది.
- రుణాన్ని 5 నుంచి 10 ఏళ్లలో తిరిగి చెల్లించుకోవచ్చు.
ఎవరెవరు అప్లై చేయవచ్చు?
- వ్యాపారం మహిళల పేరుతో రిజిస్టర్ అయి ఉండాలి.
- కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే బిజినెస్ ప్రాజెక్ట్ ప్లాన్ రెడీగా ఉండాలి.
- వ్యాపారం పార్ట్నర్‌షిప్‌లో ఉంటే, మహిళా వాటా 51% కంటే ఎక్కువ ఉండాలి.
- భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన మహిళలు అప్లై చేయవచ్చు.
ఈ స్కీమ్ ప్రత్యేకతలు
- కనీస భద్రత (కోలాటరల్) అవసరం లేదు – అంటే ఎటువంటి ప్రాపర్టీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
- మహిళలు ₹10 లక్షల వరకు రుణం పొందవచ్చు.
- పెద్ద వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే, మొత్తం ఖర్చు 25% లేదా ₹25 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
- రుణాన్ని 10 ఏళ్ల లోపు తిరిగి చెల్లించుకోవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు
- ఆధార్ కార్డు
- PAN కార్డు
- బ్యాంక్ స్టేట్‌మెంట్ (కనీసం 9 నెలల)
- ITR ఫైల్ చేసిన కాపీ
ఎలా లోన్ పొందాలి?
స్టెప్ 1: మీకు దగ్గరలోని ఏదైనా బ్యాంక్‌కు వెళ్లి మహిళా ఉద్యమి యోజన గురించి వివరాలు తెలుసుకోండి.
స్టెప్ 2: మీకు అవసరమైన లోన్ మొత్తం, వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
స్టెప్ 3: బ్యాంక్‌లో అప్లికేషన్ ఫారం తీసుకుని, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు సమర్పించండి.
Related News
స్టెప్ 4: బ్యాంక్ నుంచి అప్రూవల్ వచ్చాక, మీ అకౌంట్‌లోకి రుణం జమ అవుతుంది.
బిజినెస్ పెట్టాలనుకునే మహిళలు ఈ సూపర్ స్కీమ్‌ను మిస్ అవ్వొద్దు…ఇప్పుడే బ్యాంక్‌లో వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని అప్లై చేయండి