
డయాలసిస్ రోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 681 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు పెన్షన్ గ్రాంట్ ఫైల్ పై మంత్రి సీతక్క సంతకం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం డయాలసిస్ రోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 681 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేయనుంది. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 4,710కి చేరుకుంది. ఈ మేరకు మంత్రి సీతక్క పెన్షన్ గ్రాంట్ ఫైల్ పై సంతకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం 4,011 మంది డయాలసిస్ రోగులకు సామాజిక పెన్షన్లు ఇచ్చింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, 4,029 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేశారు. తాజా నిర్ణయంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది.
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న డయాలసిస్ రోగులను గుర్తిస్తోంది. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ రోగుల ధృవీకరణ పూర్తి చేసిన తర్వాత, SERP పెన్షన్లు మంజూరు చేస్తుంది. 681 మంది డయాలసిస్ రోగులలో 629 మంది హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో మొత్తం 52 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారు పూర్తిగా పని చేయలేకపోవడంతో వారి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు క్షీణించాయి. ఈ మేరకు వారిని గుర్తించిన రేవంత్ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త పింఛన్దారులకు వచ్చే నెల నుండి పింఛన్లు అందుతాయి.
[news_related_post]