మీరు చిన్న వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఈ కొత్త MSME (Micro, Small & Medium Enterprises) రూల్స్ తప్పక తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం MSME రూల్స్ మార్చింది. ఇప్పటి వరకు MSME స్థాయిని నిర్ణయించడానికి పెట్టుబడి మాత్రమే పరిగణలోకి తీసుకునేవారు. ఇకపై పెట్టుబడి (Investment)తో పాటు టర్నోవర్ (Turnover) కూడా కీలకం అవుతుంది.
MSME కొత్త వర్గీకరణ – పెట్టుబడి & టర్నోవర్ లిమిట్స్ మారాయి…
మైక్రో ఎంటర్‌ప్రైజ్ (Micro Enterprise):
- పెట్టుబడి ₹2.5 కోట్లు వరకు (మునుపటి లిమిట్ ₹1 కోటి మాత్రమే..)
- టర్నోవర్ ₹10 కోట్లు వరకు (మునుపటి లిమిట్ ₹5 కోట్లు)
స్మాల్ ఎంటర్‌ప్రైజ్ (Small Enterprise):
Related News
- పెట్టుబడి ₹25 కోట్లు వరకు (మునుపటి లిమిట్ ₹10 కోట్లు)
- టర్నోవర్ ₹100 కోట్లు వరకు (మునుపటి లిమిట్ ₹50 కోట్లు)
మీడియం ఎంటర్‌ప్రైజ్ (Medium Enterprise):
- పెట్టుబడి ₹125 కోట్లు వరకు (మునుపటి లిమిట్ ₹50 కోట్లు)
- టర్నోవర్ ₹500 కోట్లు వరకు (మునుపటి లిమిట్ ₹250 కోట్లు)
ఈ మార్పుల వల్ల పెద్ద మొత్తంలో MSME కంపెనీలు ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఈ మార్పులు ఎందుకు చేసింది?
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1 కోట్లకుపైగా MSME లు రిజిస్టర్ అయ్యాయి.
- MSME లు దేశ ఆర్థిక వ్యవస్థను మౌలికంగా మెరుగుపరిచే కీలక రంగంగా ఉన్నాయి.
- MSME వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందేలా చేయడానికి పెట్టుబడి & టర్నోవర్ పరిమితులు పెంచారు.
- చిన్న వ్యాపారులు ఇకపై తక్కువ ఒత్తిడితో వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.
కొత్త MSME రూల్స్ మీకు ఎలా ఉపయోగపడతాయి?
- చిన్న పెట్టుబడి పెట్టినా MSME స్టేటస్ పొందొచ్చు.
- MSME వర్గంలో రిజిస్టర్ అయితే ప్రభుత్వం అందించే రాయితీలు, లోన్ సబ్సిడీలు, ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు
- కంపెనీ గ్రో చేస్తూనే MSME ప్రత్యేక ప్రయోజనాలు పొందే వీలు
- చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలుగా ఎదిగే అవకాశం
మీ వ్యాపారం MSME కింద వస్తుందా? వెంటనే చెక్ చేసుకోండి
ఇప్పటికే వ్యాపారం నడుపుతున్నారా? కొత్తగా మొదలు పెడుతున్నారా? ఈ MSME మార్పులు మీకు లాభమే. తప్పక వాడుకోండి, వ్యాపారం మరింత వృద్ధి చేసుకోండి.