ఢిల్లీ ప్రజలకు తీపి వార్త. అయుష్మాన్ భారత్ యోజన ఎట్టకేలకు ఢిల్లీలో ప్రారంభం కానుంది. శనివారం నుంచి ఈ పథకాన్ని అమలు చేసారు. మొదట దశలో లక్ష మందికి అయుష్మాన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ఆ తర్వాత మరికొద్ది రోజులలోనే అన్ని అర్హులైన వారిని ఈ పథకంలో చేర్చే టార్గెట్ ఉంది.
ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఓ ప్రత్యేక ఒప్పందం (MOU) కూడా కుదిరింది. ఏప్రిల్ 10వ తేదీలోపు కనీసం లక్ష మందికి కార్డులు సిద్ధం చేయాలని అధికారుల లక్ష్యం. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. ఇప్పుడు అది నెరవేరనుంది. ఈ పథకం కింద ప్రతి అర్హుడికి రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులు ఉచితం. ఇందులో రూ.5 లక్షలు కేంద్రం నుండి, ఇంకొన్ని లక్షలు రాష్ట్రం భర్తీ చేస్తుంది.
మొదటగా అంత్యోదయ అన్న యోజన (AAY) కార్డ్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి కార్డులు జారీ చేస్తారు. తర్వాత బీపీఎల్ కార్డు ఉన్నవారిని కూడా చేర్చనున్నారు. మొదటి దశలో లక్ష మంది అంత్యోదయ కార్డుదారులకు కార్డులు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే రూ.2,144 కోట్లు కేటాయించింది. ఇతర రాష్ట్రాల్లో అయుష్మాన్ కార్డు ద్వారా రూ.5 లక్షల వైద్య హక్కు మాత్రమే అందుతుంటే, ఢిల్లీలో ఇది రూ.10 లక్షల వరకు ఉంది.
Related News
ప్రస్తుతం ఢిల్లీలో రెండు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. ఒకటి ప్రాధాన్య కార్డులు (BPL) – వీటి ద్వారా పేద కుటుంబాలకు సహాయం అందుతుంది. రెండవది అంత్యోదయ అన్న యోజన కార్డులు (AAY) – ఇవి అత్యంత పేద కుటుంబాలకు ప్రతినెలా 35 కేజీల రేషన్ అందిస్తాయి. ఈ రెండు కార్డులు ఉన్నవారికి తొలుత ఈ స్కీం ప్రయోజనాలు అందించనున్నారు.
ఇంతటి భారీ వైద్య భద్రతను ఉచితంగా పొందడానికి ఇదే సరైన అవకాశం. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఈ రేషన్ కార్డులు ఉంటే వెంటనే నమోదు చేసుకోండి. ఒక్క రూపాయి పెట్టకుండా రూ.10 లక్షల వైద్య భద్రత పొందే అవకాశాన్ని మిస్ అవ్వకండి.