వేసవి ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పాఠశాల విద్యార్థులకు శుభవార్త అందించింది. ఈ నెల 15 నుంచి హాఫ్-డే స్కూల్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీనితో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు పాఠశాల సమయాలు ఇలాగే కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. దీంతో మార్చి 15 నుంచి హాఫ్-డే స్కూల్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
Related News
ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటిస్తారు. ఈ వేసవి సెలవులు ఏప్రిల్ 23 నుండి జూన్ 11 వరకు ఇవ్వబడతాయని తెలుస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం జూన్ 12 నుండి ప్రారంభమవుతుంది.