EPFO అనేది దేశంలోని వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం స్థాపించిన సంస్థ. EPFO ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహిస్తుంది. ఇది వారికి పెన్షన్ బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగుల EPS-95 పెన్షన్ పథకం అనేది EPFO నిర్వహించే పెన్షన్ పథకం. ఈ పథకం పదవీ విరమణ తర్వాత వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తుంది.
EPS-95 కింద ఉద్యోగులు తమ జీతాలలో కొంత భాగాన్ని పెన్షన్ ఫండ్‌కు జమ చేస్తారు. యజమానులు కూడా అదే మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే, EPS-95 పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త ఇవ్వబోతోంది. ముఖ్యంగా EPS 95 పెన్షనర్లకు ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కనీస పెన్షన్ పెంచడం వైపు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదికలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పెన్షన్ పే ఆర్డర్లు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.