UPSC అభ్యర్థులకు మరో శుభవార్త. UPSC దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించింది. అభ్యర్థులు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట ప్రకటించిన తేదీ జనవరి 22 నుండి ఫిబ్రవరి 11 వరకు ఉండగా, దానిని 18 వరకు పొడిగించారు. అయితే, అభ్యర్థుల నుండి వస్తున్న అభ్యర్థనల మేరకు గడువును మరోసారి మరో మూడు రోజులు అంటే ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 (CSE 2025) కోసం 979 పోస్టుల నియామకానికి జనవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. UPSC తాజా నిర్ణయంతో అభ్యర్థులు 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఎడిట్ ఆప్షన్ అందించబడింది. 150 పోస్టులకు విడుదల చేసిన IAF దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 21 వరకు పొడిగించాలని కూడా UPSC నిర్ణయించింది.
UPSC : యూపీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..!!

18
Feb