
ఈ-పేమెంట్స్, యుపిఐ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో, మన డబ్బు తప్పుగా వేరే ఖాతాలోకి వెళ్లడం చాలా సాధారణం. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎదురయ్యే పెద్ద సమస్య ఏమిటంటే – తిరిగి మన డబ్బు రాబట్టుకోవడంలో వచ్చే జాప్యం. కానీ ఇకపై ఈ సమస్యకు చిరస్థాయిగా పరిష్కారం దొరికింది. NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.
జూన్ 20, 2025న విడుదలైన సర్క్యులర్ నంబర్ 184B/2025-2026 ప్రకారం, జూలై 15 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఇప్పుడు నుంచి బ్యాంకులు స్వయంగా యుపిఐ దోషాలపై చర్యలు తీసుకోగలవు. అంటే, మీ డబ్బు తప్పు ఖాతాలోకి వెళ్లినా, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, మీరు బ్యాంక్‌కి ఫిర్యాదు చేస్తే, వారు ఇకపై NPCI అనుమతి లేకుండానే చర్య తీసుకోగలుగుతారు.
ఇప్పటి వరకు బ్యాంకులు ఎలాంటి సమస్య వచ్చినా NPCI అనుమతితోనే పని చేయాల్సివచ్చేది. దీని వల్ల పరిష్కారంలో జాప్యం వచ్చేది. ఇప్పుడు ఈ నిబంధన రద్దయ్యింది.
[news_related_post]కొత్తగా పరిచయం చేసిన విధానం పేరు RGNB అంటే Remitting Bank Raising Good Faith Negative Chargeback. దీని ద్వారా మీ ఫిర్యాదు నిజంగా న్యాయంగా ఉందని బ్యాంక్ అనిపిస్తే, వారు మీరు NPCI వద్ద వెయిట్ చేయకుండా స్వయంగా చార్జ్‌బ్యాక్ నమోదు చేయగలుగుతారు.
ఈ “గుడ్ ఫెయిత్” చార్జ్‌బ్యాక్ ఒక న్యాయమైన క్లెయిమ్ అని భావించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఇదివరకు ఒకే ఖాతా లేదా యుపిఐ ఐడీపై చాలాసార్లు రిజెక్ట్ అయినా, ఇప్పుడు బ్యాంక్ మీ పక్షాన నిలబడి చర్య తీసుకోగలదు.
గతంలో మీ ఫిర్యాదు మీద బ్యాంక్ విశ్వాసంతో ఉన్నా, వారు తలుపు తట్టాల్సింది NPCI వద్దే. ఆ ప్రక్రియలో మాన్యువల్ రిక్వెస్ట్ పంపించాలి, వెరిఫికేషన్ జరగాలి, అంతా జరిగేలోగా మీ డబ్బు తిరిగి రావడంలో చాలాసేపు పడేది. ఇది చాలా మందిని విసిగించేది. ఇప్పుడు ఆ దశలు పూర్తిగా తొలగించి, బ్యాంకుకే డెసిషన్ తీసుకునే అధికారం ఇవ్వడం వల్ల – చిరకాలంగా ఉండే సమస్యకు పరిష్కారం దొరికినట్లే.
మీ ట్రాన్సాక్షన్ తప్పుగా జరిగితే లేదా డబ్బు వేరే ఖాతాలోకి వెళ్లినట్లయితే, వెంటనే మీ బ్యాంక్‌కి ఫిర్యాదు చేయండి. వారు మీ క్లెయిమ్ని గమనించి, అది గుడ్ ఫెయిత్ లో ఉంటే, వెంటనే చార్జ్‌బ్యాక్ ప్రారంభిస్తారు. NPCI అనుమతి లేకుండా ఇది సాధ్యం అవుతుంది.
ఈ మార్పుతో మీ డబ్బు తక్కువ సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. గతంలో కొన్ని రోజులు పట్టిన పని, ఇప్పుడు 24 గంటల్లో కూడా పూర్తి కావచ్చు.
ఇప్పుడు నుంచే మీరు అప్రమత్తంగా ఉండాలి. యుపిఐ ద్వారా లావాదేవీ చేయాలంటే అవసరమైన ఖాతా నంబర్, యుపిఐ ఐడీ, బ్యాంక్ పేరును ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అయినా కూడా పొరపాటు జరిగితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త విధానం మీకు రెండు లక్షల ట్రాన్సాక్షన్ అయినా సులభంగా తిరిగి వచ్చే మార్గం చూపుతుంది.
ఈ నిబంధనలతో యుపిఐ వినియోగదారుల భద్రత మరింత మెరుగుపడనుంది. ఇప్పుడు మీ బ్యాంక్ మీ తరఫున పోరాడుతుంది. ఫిర్యాదు చేయగానే ఇన్వెస్టిగేషన్, చార్జ్‌బ్యాక్, రికవరీ అన్నీ త్వరితగతిన జరుగుతాయి. ఈ మార్పు బ్యాంకులకు అధిక స్వాతంత్ర్యం, వినియోగదారులకు త్వరిత న్యాయం ఇస్తుంది.
ఇప్పుడు మీ డబ్బు తప్పుగా వెళ్ళినా, అది తిరిగి రావడం ఆలస్యం కాదు. జూలై 15, 2025 నుంచి ఈ కొత్త విధానం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏ ట్రాన్సాక్షన్ అయినా మీకు నష్టం కలిగినట్లయితే, NPCI వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా బ్యాంక్ద్వారానే పరిష్కారం పొందవచ్చు.