బీహార్ ప్రభుత్వము యువత భవిష్యత్తు కోసం ముందడుగు వేస్తోంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నవారికి భారీ ఊరట కలిగించే ‘నిరుద్యోగ భృతి’ పథకాన్ని అందిస్తోంది. ‘ముఖ్యమంత్రి స్వయంసహాయ భృతి పథకం’ (Bihar Berojgari Bhatta Yojana) పేరు మీద ఈ పథకం అమలులో ఉంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ నెలా రూ.1000 మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నిరుద్యోగ యువత అకౌంట్‌లోకి పంపుతుంది.
పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే
ఈ స్కీమ్ 2016లో ప్రారంభమైంది. దీని ద్వారా 12వ తరగతి వరకు చదివి, ఆ తర్వాత చదువును కొనసాగించలేకపోయిన యువతకు నెలకు రూ.1000 భృతిగా అందుతుంది. వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ సాయాన్ని గరిష్ఠంగా 2 సంవత్సరాల పాటు అందిస్తారు. అంటే మొత్తం 24 నెలలలో రూ.24,000 వరకు లభించవచ్చు.
ఎవరెవరు అర్హులు?
ఈ స్కీమ్ కోసం కొన్ని అర్హతలు ఉండాలి. దరఖాస్తుదారు బీహార్ నివాసి అయి ఉండాలి. 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అప్పటి నుంచి చదువు ఆపి, ప్రస్తుతం నిరుద్యోగిగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఎక్కడా పని చేయకూడదు. స్కాలర్‌షిప్, స్టూడెంట్ క్రెడిట్ కార్డు, ఎడ్యుకేషన్ లోన్ లాంటి ఇతర పథకాల ప్రయోజనం పొందకూడదు. ఉద్యోగం వస్తే, ఆ రోజు నుంచే భృతి ఆగిపోతుంది.
Related News
అప్లై చేయాలంటే ఎలా?
ఈ పథకం కోసం దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత మీ జిల్లాలోని రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ సెంటర్‌కు సంబంధిత డాక్యుమెంట్లతో వెళ్లాలి. అక్కడ పరిశీలన పూర్తైన తర్వాత, మీరు అర్హత కలిగితే డబ్బు మీ ఖాతాలోకి నేరుగా వస్తుంది. అంతే కాకుండా, ఈ పథకం ద్వారా డబ్బు పొందాలంటే ‘కుశల్ యువా ప్రోగ్రామ్’ ద్వారా బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకోవాలి. చివరి 5 నెలల డబ్బును పొందాలంటే ఈ ట్రైనింగ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాలి.
పెద్దగా ఖర్చు చేయకుండా, ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు ఈ స్కీమ్‌తో నెలకు ₹1000 ఆదాయం పొందవచ్చు. రెండు సంవత్సరాల్లో ₹24,000 పొదుపు అవుతుంది. అదే సమయానికి మీరు కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకొని మంచి ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉంటుంది. యువత ఈ అవకాశం మిస్ కాకుండా వెంటనే దరఖాస్తు చేయండి.
ఇప్పుడే అప్లై చేయండి – ప్రభుత్వ డబ్బు మిస్సవ్వద్దు.