Indiramma illu: బ్రేకింగ్ న్యూస్.. చెక్కుల పంపిణీ ప్రారంభం.. ఫస్ట్ చెక్కు ఎంత?..

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఎదురుచూసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమైంది. మంగళవారం (ఏప్రిల్ 15) ఉదయం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

12 మంది అర్హులైన లబ్ధిదారులకు తొలి చెక్కులు

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఎంపికైన 12 మంది అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున అందజేశారు. మొదటి చెక్కును మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రకు చెందిన లక్ష్మీ అనే మహిళ అందుకున్నారు.

ఈ జిల్లాలకు చెందిన లబ్ధిదారులు

రాష్ట్రంలోని రంగారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మొదటి విడతగా రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందించారు.

Related News

ముఖ్య నాయకుల హాజరు

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. ఇంకా పలువురు MLAలు, MLCలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ నిర్మాణం కల సాధించుకోవడానికి లక్షలాది పేద కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.

ఇది కేవలం ఆరంభం మాత్రమే

ఈ పథకం ద్వారా వచ్చే రోజుల్లో వేలాది మంది అర్హులైన లబ్ధిదారులకు ధన సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి విడతగా మొదటి 12 మందికి పంపిణీ చేసిన ఈ చెక్కులు చారిత్రాత్మకంగా నిలవనున్నాయి.

మీరు కూడా అర్హులేనా?

ఇంకా అప్లై చేయని వారు అధికారిక వెబ్‌సైట్‌లో ద్వారా అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కలిపించే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది. త్వరలోనే మిగతా జిల్లాల్లో కూడా పంపిణీ కార్యక్రమాలు జరగనున్నాయి.

ఇంట్లో కూల్‌గా కూర్చుని, ప్రభుత్వ చెక్కు తీసుకోవాలంటే ఇప్పుడే అప్లై చేయండి. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి.