గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం… వడ్డీ రేట్లు ఈ సారి కూడా అవే.. పెట్టుబడి దారులకు పండుగే…

PPF, NSC, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్రా వంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టినవారికి కీలక సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేయకుండా అలాగే కొనసాగించాలని నిర్ణయించింది.

ఇది వరుసగా 5వ త్రైమాసికం వడ్డీ రేట్లలో మార్పు జరగలేదు. అంటే మీ పెట్టుబడులు ఇప్పుడు కూడా అదే వడ్డీ రేట్లతో కొనసాగుతాయి. మరి ఏ స్కీమ్‌పై ఎంత వడ్డీ ఉంటుంది? ఏదైనా మార్పు వచ్చిందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏప్రిల్-జూన్ 2025కి వడ్డీ రేట్లు యథాతథం

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2025 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉండే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు మార్చలేదు. అంటే ప్రస్తుత జనవరి-మార్చి 2025 త్రైమాసికంలో ఉన్నవే వడ్డీ రేట్లు కొనసాగుతాయి. ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లపై అదే స్థాయిలో వడ్డీ పొందనున్నారు. ప్రభుత్వం చివరిగా 2023-24 ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికంలోనే వడ్డీ రేట్లను సవరించింది. అప్పటి నుంచి ఈ రేట్లు మారలేదు.

PPF, Sukanya, NSC – ఏ స్కీమ్‌కు ఎంత వడ్డీ?

సుకన్య సమృద్ధి యోజన (SSY) – 8.2%. 3 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ – 7.1%. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) – 7.1%. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ – 4%. కిసాన్ వికాస్ పత్ర (KVP) – 7.5% (115 నెలల్లో మెచ్యూరిటీ). నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) – 7.7%. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) – 7.4%

Related News

5వ సారి మార్పు లేకుండా వడ్డీ రేట్లు కొనసాగింపు.

ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అయితే, గత 5 త్రైమాసికాలుగా ఎటువంటి మార్పు చేయలేదు. ఇది కొంతమందికి నిరాశ కలిగించవచ్చు, మరికొందరికీ స్థిరత ఇచ్చే వార్త అవుతుంది. ఈ నిర్ణయం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల ప్రాతిపదికగా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను ప్లాన్ చేసుకునే ముందు, ఈ వడ్డీ రేట్లను తప్పకుండా పరిశీలించాలి.

మీ పెట్టుబడి సురక్షితమా? ఈ స్థిరత మేలు చేస్తుందా?

సురక్షితమైన పెట్టుబడి: స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో పెట్టిన డబ్బు సురక్షితంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు మారని వడ్డీ రేట్లు కొంత వరకు ఊరట కలిగించవచ్చు. ద్రవ్యోల్బణంపై ప్రభావం: ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, వడ్డీ రేట్లు మారకపోవడం కొంతమంది ఇన్వెస్టర్లకు సమస్యగా మారవచ్చు. పెద్ద మార్పుల కోసం ఎదురు చూపులు: ఇన్వెస్టర్లు వడ్డీ రేట్లు పెరిగే అవకాశముందా? లేదా? అన్న దానిపై ఆందోళనలో ఉన్నారు.

మీరు ఇంకా కొత్తగా పెట్టుబడి పెట్టాలా? లేక వేచి చూడాలా?

ఇప్పటి పరిస్థితుల్లో కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, లాభనష్టాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పటికే పెట్టుబడి పెడితే, ఈ త్రైమాసికంలో ఎలాంటి మార్పు ఉండదని ధైర్యంగా ఉండొచ్చు