
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పర్సన్లు మరియు వారి కుటుంబ సభ్యులకు ఇది మంచి వార్త. ఇప్పటి వరకు CGHS (Central Government Health Scheme) సేవలు వాడేందుకు చాలా మంది ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఆ అవస్థ అంతా అయిపోయింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా కొత్త HMIS పోర్టల్ మరియు మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఇంటి నుంచే CGHS కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయొచ్చు, మెడికల్ సేవలు పొందొచ్చు.
CGHS సేవలను పూర్తిగా డిజిటల్ చేయాలనే లక్ష్యంతో Health Management Information System (HMIS) అనే కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చారు. దీనితో పాటు మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించబడింది. మీరు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ అయి, మీ సేవలను ఇంటి నుంచే వాడుకోవచ్చు.
ఇప్పటి వరకు CGHS సేవల్లో కొన్ని సందర్భాల్లో డూప్లికేట్ కార్డులు, డేటా పొరపాట్లు జరిగేవి. ఇప్పుడు దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు, ప్రతి బెనిఫిషియరీకి PAN ఆధారంగా యూనిక్ CGHS ID ఇస్తున్నారు. ఇది ఆధార్ లాగా వర్క్ చేస్తుంది. అన్ని మెడికల్ రికార్డులు ఒకే ప్లేస్‌లో భద్రంగా ఉండేలా చూస్తుంది. అలాగే, మోసాలు జరుగకుండా ఉండేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది.
[news_related_post]ఇప్పటి వరకు CGHS సబ్స్క్రిప్షన్ లేదా రీన్యువల్ కోసం Bharatkosh పోర్టల్ వాడే వాళ్లం. కానీ ఇప్పుడు ఆ పాత పోర్టల్‌ను మూసివేసి, కొత్త HMIS పోర్టల్ నుంచే చెల్లింపులు జరగాలి. ఇందులో మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, UPI ద్వారా చెల్లింపులు చేయొచ్చు. మీరు ఫీజు చెల్లించిన వెంటనే వెరిఫికేషన్ కూడా పూర్తవుతుంది.
ఇప్పటి వరకు BiPAP, CPAP, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లాంటి మెషీన్ల కోసం డాక్యుమెంట్లు దాఖలు చేసి ఆమోదం కోసం చాలా రోజులు వేచి ఉండేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. కొత్త HMIS పోర్టల్ ద్వారా మీరు ఇంటి నుంచే అప్లై చేసి, మొత్తం 5 రోజుల్లో అనుమతి పొందవచ్చు. ఇది ముందు 20 రోజులు పడేది. ఇది రాత్రిళ్ళు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికోసం ఒక మంచి అవకాశం.
మీరు ఏదైనా అప్లికేషన్ పంపిన తర్వాత దాని అప్డేట్, ఆమోదం, చెల్లింపు వెరిఫికేషన్ వంటివన్నీ మీ ఫోన్‌కు మెసేజ్, ఈమెయిల్ ద్వారా రియల్ టైం అప్డేట్స్ వస్తాయి. దీని వల్ల మీకు ఎప్పుడు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.
HMIS పోర్టల్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ప్రతి CGHS కార్డ్ హోల్డర్ ఈ క్రింది పనులు వెంటనే పూర్తి చేయాలి. ముందుగా కొత్త పోర్టల్‌కి లాగిన్ కావాలి. మీ PAN నంబర్‌ను లింక్ చేయాలి. తర్వాత మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసి, అందులో లాగిన్ అవ్వాలి. మీ ఈమెయిల్, ఫోన్ నంబర్ యాక్టివ్‌గా ఉంచి, నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు పొందండి.
ఇప్పటి వరకూ CGHS సేవలు పొందటానికి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ వారు చాలా బాధలు అనుభవించారు. ఇప్పుడు కొత్త డిజిటల్ మార్గం వల్ల వారు సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇంటి నుంచే ఆరోగ్య సేవలను పొందగలిగే వీలుండటంతో, ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.
ఇక ఆసుపత్రి చుట్టూ తిరుగే రోజులు పోయాయి… CGHS కొత్త యాప్‌తో ఇంటి నుంచే కార్డు, అపాయింట్మెంట్, మెషీన్ అనుమతి, అన్నీ ఒక్క క్లిక్‌లో పొందండి… PAN ఆధారిత IDతో సురక్షితంగా సేవలు వాడండి…