ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇక నుంచి ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జీతాల చెల్లింపులో ఆలస్యం చేయకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతి నెల ఒకటవ తేదీనే ఖచ్చితంగా చెల్లించాలని ఆయన అన్నారు.
ప్రతి నెల ఒకటవ తేదీ జాప్యాన్ని సహించబోనని చంద్రబాబు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు చెల్లిస్తేనే వారు బాగా పనిచేస్తారని ఆయన అన్నారు. గత కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక శాఖలలో బకాయిలు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.22.507 కోట్ల బకాయిలు చెల్లించామని ఆయన అన్నారు.