గత 4 రోజులుగా వినియోగదారులకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు తాజాగా సోమవారం పెద్ద ఊరటనిచ్చాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులకు శుభవార్త అందినట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను ఒకసారి పరిశీలిద్దాం..
బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఒకరోజు పెరిగితే మరుసటి రోజు తగ్గుతాయి. గత నాలుగు రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు సోమవారం తగ్గాయి. దీంతో వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది.
అయితే ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,350. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840. ఇక వెండి ధర విషయానికి వస్తే ఆదివారం కిలో వెండి ధర రూ. 92,600. ఈరోజు అంటే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,340. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,830. ఇక వెండి ధర విషయానికి వస్తే ఆదివారం కిలో వెండి ధర రూ. 92,500.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,340 10 గ్రాములు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 గ్రాములకు 77,830. విశాఖపట్నం, విజయవాడలోనూ ఇదే ధర కొనసాగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,490 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,849.
ఇక వెండి ధరల విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో కిలో వెండి ధర రూ. 99,800, ముంబైలో రూ. 92,500, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులలో కిలో వెండి ధర రూ. 92,300. తాజా బంగారం ధరలను తెలుసుకోవడానికి మీరు 8955664433కు మిస్డ్ కాల్ కూడా ఇవ్వవచ్చు.