Gold Price : కొత్త సంవత్సరంలో భారీ శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!

కొత్త సంవత్సరంలో బంగారం ప్రియులకు శుభవార్త అందింది. ఈ ఏడాది ప్రారంభంలో వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి. శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో బంగారం ప్రియుల్లో మరోసారి ఆనందం వెల్లివిరిసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 4900 తగ్గింది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 4500 తగ్గింది. హైదరాబాద్‌లో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 7,26,000 ఉండగా, శనివారం 4500 తగ్గి 7,21,500కి చేరుకుంది.

అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం శుక్రవారం 7,92,000 మరియు 4900 తగ్గి 7,87,100 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల బంగారం 72,150 మరియు 24 క్యారెట్ల 78,710. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌లో ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

Related News