
ఏకంగా ఏడాదికి ₹1 కోటి జీతం! ఇది విని నమ్మలేకపోయినా.. నిజం. ఇది ఉద్యోగం అనే మాటకే కొత్త అర్థం చెప్పేలా ఉంది. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఇచ్చిన కంపెనీ పేరు “Smallest AI”. బెంగళూరులో ఉన్న ఈ స్టార్ట్అప్ కంపెనీ ఒక స్పెషల్ జాబ్ పోస్టింగ్ ఇచ్చింది. ఇది ఓ ఫుల్ టైమ్ జాబ్. వీరి టీమ్‌కి “Cracked Full Stack Lead” కావాలంటూ పోస్టింగ్ ఇచ్చారు.
ఈ జాబ్ కి సాలరీ ఏకంగా రూ. కోటి. ఇది ఏ కంపెనీ అయినా ఇచ్చే రేంజ్ కాదు. పైగా, ఇది ఒక చిన్న స్టార్ట్అప్ కావడం వల్లా ఈ ఆఫర్‌ను చూసినవాళ్లంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ జాబ్ ఆఫర్ వైరల్ అవుతోంది. ఈ జాబ్‌కి అప్లై చేసే వ్యక్తికి స్కిల్స్ మాత్రమే కాదు, నిజంగా టాలెంట్ ఉండాలి. ఎందుకంటే కంపెనీ డైరెక్టర్లే స్వయంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు.
ఈ ఉద్యోగానికి సరిపోయే వారు 4–5 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. ముఖ్యంగా వెబ్ డెవలప్మెంట్లో, ఫుల్ స్టాక్ టెక్నాలజీల్లో అనుభవం ఉండాలి. Next.js, Python, React.js లాంటి ఫ్రేమ్‌వర్క్స్‌లో నెయిటివ్గా పని చేసిన అనుభవం అవసరం. జాబ్‌లో చేరిన తర్వాత 100 డేస్ లోపల ప్రూవ్ చేసుకోవాలి. అంటే వారి ప్రాజెక్ట్‌లలో టెక్నికల్ నైపుణ్యం చూపించాలి. అప్పుడే కంపెనీ పూర్తి జీతం చెల్లిస్తుంది.
[news_related_post]ఈ కంపెనీ డైరెక్టర్ సుదర్శన్ కామత్ స్వయంగా ట్విట్టర్లో ఈ వివరాలు షేర్ చేశారు. ఈ ఉద్యోగం పక్కా ఆఫర్ అని స్పష్టంగా చెప్పారు. వాళ్ల టీమ్‌లో మంచి టాలెంట్ ఉన్న లీడ్ కావాలన్న ఉద్దేశంతో ఈ హై పే పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి ఫేక్దనం లేదు. ఇప్పటికే చాలా మంది అప్లై చేస్తున్నారు. ఈ పోస్టుకు ముందే చాలా మంది తమ ప్రొఫైల్‌లు పంపిస్తున్నారు.
ఇక మీరు IT రంగంలో ఉన్నారా? అసలైన ఛాలెంజ్ ఎదుర్కొని పేరు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ జాబ్ మీ కోసమే. ₹1 కోటి జీతం, ప్రత్యక్షంగా డైరెక్టర్లతో ఇంటర్వ్యూ, ఫుల్ స్టాక్ లీడ్ పోస్టింగ్ – ఇవన్నీ కలిపి బిగ్ ఛాన్స్. అలాంటి అవకాశాన్ని ఇప్పుడు మిస్ అయితే.. తర్వాత పశ్చాత్తాపమే మిగిలిపోతుంది.