Girlfriend For Rent: India లో అద్దెకి ప్రియురాలు. .. రెండు రోజులకు పది వేలే.. కానీ?

Girlfriend For Rent: Divya Giri వీడియో సోషల్ మీడియాలో వైరల్: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్ అంటే గర్ల్‌ఫ్రెండ్‌ని అద్దెకు తీసుకోవడం. మీరు చదివింది నిజమే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమని భావించిన కొన్ని కాన్సెప్ట్‌లు ఇప్పుడు భారత్‌కు కూడా వస్తున్నాయి. విదేశాల్లోని పరిస్థితుల నేపథ్యంలో గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్, అమ్మ, నాన్న, చెల్లి.. ఇలా ఎలాంటి రిలేషన్‌షిప్‌ అయినా అద్దె కొరకు తీసుకోవచ్చు.. ఇప్పుడు ఇండియాలో గర్ల్‌ఫ్రెండ్‌ని అద్దెకు ఇచ్చే కంపెనీలు ఇంకా స్టార్ట్ కాలేదు కానీ కొందరు ఔత్సాహిక యువతులు పోస్ట్‌లు పెడుతున్నారు. తామే ఒక రెంట్ ఫిక్స్ చేసి డేట్ కు రెడీ అవుతున్నామంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా దివ్య గిరి అనే యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మీరు ఒంటరిగా ఉన్నారా? ఇంకా తేదీకి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ డేట్ కోసం నన్ను నియమించుకోండి అని రాసింది.

అంతేకాదు, ఆమెను ఒక రోజంతా అద్దెకు తీసుకుని కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించమని అడుగుతోంది. అంతేకాదు తన అద్దెకు సంబంధించిన రేట్ కార్డును కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  • ఆ ప్రకారం కాఫీ డేట్‌కి 1500,
  • మామూలు డేట్‌కి 2000
  • డిన్నర్‌తో సినిమా చూడటానికి 3000,
  • ఫ్యామిలీతో కలవడానికి 3000,
  • కలిసి ఏదైనా ఈవెంట్‌కి వెళ్లడానికి 3500,
  • బైక్ డేట్ కోసం 4000
  • చేతులు పట్టుకుని డేటింగ్ చేయడానికి 6000
  • సోషల్ మీడియా పోస్టింగ్ మొత్తానికి 5000,
  • ఇంట్లో వంట చేసి కలిసి తినడానికి 3500,
  • కలిసి షాపింగ్ చేయడానికి 4500,

వీకెండ్ గెట్ అవేకి 10000 అంటే ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఒక్కో ప్రోగ్రామ్ కి ఒక్కో రేటు కూడా ఫిక్స్ చేసింది.

అయితే ఇది నిజమా లేక సోషల్ మీడియా అటెన్షన్ కోసం ఆమె చేసిందా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.