Fan Helmet: హెల్మెట్‌లో ఫ్యాన్?… ఇప్పుడు మ‌న హెడ్డు కి కోడా ఏసీ…

టెక్నాల‌జీ అనే ప‌దం విన‌గానే ఇప్పుడు అంద‌రికీ ఓ మాయ‌జాలం గుర్తొస్తుంది. ఏ రంగం తీసుకున్నా… టెక్నాల‌జీ అందులో దూసుకుపోతోంది. ఇప్పుడు బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ల‌కు గుడ్‌న్యూస్. ఎందుకంటే, హెల్మెట్ లోకూడా ఫ్యాన్ వ‌చ్చేసింది… హౌస్‌లోనో ఏసీలోనో ఉన్న‌ట్టు త‌ల చ‌ల్ల‌గా ఉంటుంది. మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు కానీ ఇది నిజం…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ హెల్మెట్ మీ త‌ల‌ను కేవ‌లం ర‌క్షించ‌దు, మీకు వేస‌విలో చల్లటి శక్తినీ ఇస్తుంది. దీనిలో ఉన్న ఫ్యాన్‌ను సూర్యుడే చార్జ్ చేస్తాడు. స‌దా చెమ‌ట‌ప‌ట్టే వాళ్ల‌కు ఇది ఓ వరం‌లా ఉంటుంది. వేస‌వి కాలంలో బైక్ మీద వెళ్తూ త‌ల చెమ‌ట‌ప‌డ‌డం ఎంత ఇబ్బందో తెలుసుకదా… ఆ బాధ‌కు ఇక‌ శాశ్వ‌తంగా గుడ్‌బై చెప్పొచ్చు.

బైక్ లేదా స్కూటీ న‌డిపే వారికి హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి. ఇది ట్రాఫిక్ పోలీసుల చెక్‌ల నుంచి కాపాడ‌డం క‌న్నా ముందు, ప్రాణాన్ని కాపాడే సాధ‌నం. కానీ వేస‌విలో హెల్మెట్ వేసుకోగానే తల‌కు చుట్టుముట్టే వేడి, చెమ‌ట… అది ఓ బాధ‌గా మారుతుంది. అంతే కాదు, ఓ ప్ర‌యాణ‌మంతా అస‌హ‌నంగా మారిపోతుంది.

ఇప్పుడు ఆ బాధ‌తో పనిలేదు. ఈ కొత్త హెల్మెట్ లో ఏసీ ఫీచ‌ర్ వ‌ల్ల త‌ల‌కు చ‌ల్ల‌ద‌నం క‌లుగుతుంది. బైక్ మీదున్నా, ట్రాఫిక్‌లో నిలిచినా… మీ తల చ‌ల్ల‌గా ఉంటుంది. ఇది ట్రెండీగా ఉండ‌డం క‌న్నా ముందు, యూజ‌ర్స్‌కు కంఫర్ట్ ఇవ్వడమే లక్ష్యంగా రూపొందించ‌బ‌డింది.

ఈ స్పెషల్ హెల్మెట్‌ పేరు వైట్ చెర్రీ స్మార్ట్ హెల్మెట్‌. దీనిని ప్రముఖ కంపెనీ “White Cherry” తయారుచేసింది. ఇది అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ హెల్మెట్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. పలు వెర్షన్లలో ఇది లభిస్తుంది. ఇది కేవలం హెల్మెట్ కాదు… టెక్నాలజీతో మిళితమైన హైటెక్ గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు. చాలా మంది బైక్ ప్రియులు ఇప్పుడు ఈ హెల్మెట్ వైపు మొగ్గుచూపుతున్నారు.

ఈ స్మార్ట్ హెల్మెట్ లో ఉన్న ఫీచర్లు వినగానే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో వైర్లెస్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే… మీ ఫోన్‌కి కనెక్ట్ చేసుకుని హెల్మెట్ నుంచే కాల్స్ అటెండ్ చేయ‌వ‌చ్చు. డ్రైవింగ్ చేస్తూ కూడా మీరు హ్యాండ్స్‌ఫ్రీగా మాట్లాడ‌వ‌చ్చు.

ఫోన్‌లో కాల్ వస్తే, హెల్మెట్ మీద ఇచ్చిన బ్లూటూత్ బటన్ నొక్కితే చాలు, డైరెక్ట్‌గా మాట్లాడ‌వ‌చ్చు. ఇక హెల్మెట్ లో స్పీక‌ర్‌, మైక్ ఉంటాయి కాబ‌ట్టి, శ‌బ్ధ‌ప్ర‌తిధ్వ‌ని లేకుండా స్పష్టంగా వినిపిస్తుంది. డ్రైవింగ్ టైమ్‌లో కూడా క్లారిటీగా శబ్దం వినిపించ‌డం ఇది ఓ బిగ్ ప్ల‌స్ పాయింట్.

ఇది అక్కడితో ఆగదు. హెల్మెట్ మీద ఉన్న సోలార్ ప్లేట్ సూర్యరశ్మితో బ్యాట‌రీని చార్జ్ చేస్తుంది. అంటే, ఫ్యాన్ పనిచేయడానికి కావాల్సిన పవర్ ను సూర్యుడు అందిస్తాడు. కరెంటు లేకపోయినా చింతించాల్సిన పనిలేదు. పగలంతా వెలుతురు ఉంటే చాలు, హెల్మెట్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది.

ఈ హైటెక్ హెల్మెట్ ధర గురించి చెప్పాలంటే, అది కూడా పెద్ద‌గా భారం కాదు. మామూలు హెల్మెట్ల కన్నా కొంచెం ఎక్కువే అయినా… అందులో ఉన్న సౌక‌ర్యాల‌ను బ‌ట్టి చూస్తే ఖ‌చ్చితంగా Worth It అనే ఫీలింగ్ మిగిలుతుంది. ముఖ్యంగా వేస‌వి రోజుల‌కి ఇది ఓ వరం‌లా మారుతుంది. మీ సేఫ్టీతోపాటు కంఫర్ట్, స్టైల్‌, టెక్నాల‌జీ అన్నీ ఒక్క‌టే ప్యాక్‌లో కావాలంటే, ఈ హెల్మెట్ తప్ప మరో ఆప్షన్ ఉండదు. వేస‌విలో హెల్మెట్ వేసుకోవ‌డం భ‌యం కాదు… ఆనందంగా మారుతుంది.

వేసవి వేడి నుంచి తలని కాపాడుకోవాలంటే, డ్రైవింగ్ సమయంలో చెమటతో పోరాడకూడదనుకుంటే… మీరు వెంటనే ఈ స్మార్ట్ హెల్మెట్ కొనాల్సిందే. ఇది కేవ‌లం ల‌గ్జ‌రీ కాదు… మీరు డ్రైవింగ్ చేసే ప్రతీసారి ఉపయోగపడే ప్రాక్టిక‌ల్ గాడ్జెట్. ఇప్ప‌టికే చాలా మంది బైక్ ల‌వ‌ర్స్ దీన్ని కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఆల‌స్యం చేయ‌కండి…

ఇది మామూలు హెల్మెట్ కాదు… వేస‌విలో మిమ్మ‌ల్ని ర‌క్షించే చ‌ల్ల‌ని క‌వ‌చం… రోడ్ మీద వెళ్లేట‌ప్పుడు మీరు ఆనందంగా డ్రైవ్ చేయాలంటే… ఫోన్ కాల్ రీసీవ్ చేయ‌గ‌లిగే, ఫ్యాన్‌తో తల చల్లగా ఉంచే ఈ హెల్మెట్ మీకోసం రెడీగా ఉంది.

ఇంకెందుకు ఆల‌స్యం? వేస‌వి పోతున్నంత లోపు ఈ హెల్మెట్ మీ చేతికి తీసుకోండి…