Toyota: కొత్త SUV తో పెట్రోల్ లేని డ్రైవింగ్… ఒక్క ఛార్జ్ తో 80 కి.మీ నడుస్తుంది…

టయోటా మళ్లీ ఆటో మొబైల్ మార్కెట్‌లో అలజడి రేపుతోంది. ఈ సారి RAV4 అనే కొత్త హైబ్రిడ్ SUV తో వచ్చేసింది. ఇప్పుడు అందరి దృష్టీ ఈ బండిపై పడుతోంది. ఎందుకంటే ఇది సాధారణ కార్ల మాదిరిగా కాకుండా… పెట్రోల్ లేకున్నా కూడా 80 కిలోమీటర్ల దూరం నడవగలదు. మీరు ఊహించినట్టే, ఇది టయోటా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా సాధ్యమైంది. ‘ఫ్యూచర్ రెడీ కార్ ఇది’ అనే మాటకు నిజంగా న్యాయం చేస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ కొత్త SUV లో టయోటా అనేక మార్పులు చేసింది. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిందేమంటే… దీని లుక్‌! మినీ ఫార్చ్యూనర్ లా కనిపించే స్టైల్ తో ఇది వచ్చేసింది. ఫ్రంట్ గ్రిల్ చాలా షార్ప్‌గా ఉంది. బాడీ లైన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. రోడ్డుమీద ఈ కార్ వెళ్తుంటే, వెనకాల నుంచి చూసే వారికే కాకుండా ఎదురుగా వచ్చేవాళ్లకూ దీని స్పోర్టీ డిజైన్ ఒక్కసారిగా తట్టిపడుతుంది.

ఇక క్యాబిన్ విషయానికి వస్తే, ఇందులో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అంతా మిక్స్ అయ్యింది. కొత్త 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది టయోటా అరీన్ సాఫ్ట్‌వేర్ పై పనిచేస్తుంది. నావిగేషన్, మ్యూజిక్, కనెక్టివిటీ అన్నీ చాలా స్మార్ట్‌గా వర్క్ చేస్తాయి. మరోపక్క 10.5 అంగుళాల మల్టీమీడియా డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తంగా టెక్నాలజీ & లగ్జరీని కలిపిన క్యాబిన్ ఇది.

ఇప్పుడు అసలు మ్యాటర్ గురించి మాట్లాడుదాం. పెట్రోల్ అయిపోతే మామూలు కార్ల పరిస్థితి మీకెందుకు చెప్పాలి? కానీ ఈ RAV4 SUV మాత్రం ఆ పరిస్థితిలో కూడా గట్టిగా నిలబడుతుంది. ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్ లో వస్తుంది. దీని బ్యాటరీను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఏ పేట్రోల్ అవసరం లేకుండానే ఇది 80 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే, చిన్న టూర్‌కి కూడా వెళ్లొచ్చు.

ఇందులో రెండు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి స్ట్రాంగ్ హైబ్రిడ్. మరొకటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్. ఈ రెండిటికీ 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ 236 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. PHEV మోడల్ అయితే 320 హార్స్ పవర్ ఇవ్వగలదు. ఇక ట్రాన్స్‌మిషన్ 8-స్పీడ్ ఆటోమేటిక్. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మామూలుగా ఉండదు. ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ వల్ల, ఎలాంటి రోడ్ల మీదైనా ఈ SUV బెస్ట్ పనితీరును ఇస్తుంది.

ఇంకా మైలేజ్ గురించి మాట్లాడితే, ఇది గట్టి షాక్ ఇస్తుంది. కంపెనీ ప్రకారం, కొత్త RAV4 SUV దాదాపు 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది కేవలం 5.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంటే ఇది స్పోర్ట్స్ కార్ల స్థాయిలో పర్ఫార్మ్ చేస్తుంది. ఇలాంటి స్పీడ్, ఇలాంటి మైలేజ్ కలిసే కార్ చాలా అరుదుగా దొరుకుతుంది.

భద్రత కూడా టయోటా ప్రధానంగా చూసింది. ఇందులో “సేఫ్టీ సెన్స్ ADAS” అనే యాడ్వాన్స్‌డ్ భద్రత వ్యవస్థను అమర్చారు. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి టాప్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు 6 ఎయిర్‌బ్యాగులు, పార్కింగ్ కెమెరా, సీట్ బెల్ట్ అలర్ట్ వంటి అన్ని ఆధునిక భద్రత ఫీచర్లు ఇందులో పొందుపరిచారు.

వేరే మాటలో చెప్పాలంటే, ఇది ఫ్యామిలీ కోసం సేఫ్, డ్రైవింగ్ కోసం ఫన్, ఫ్యూచర్ కోసం రెడీ. స్పోర్టీ లుక్ కోరుకునే వాళ్ల కోసం GR స్పోర్ట్ వెర్షన్ కూడా ఉంది. అది ఇంకాస్త ఎక్కువ ఫీచర్లు, డిజైన్ అదనంగా తీసుకొస్తుంది.

ఇప్పుడు ధర గురించి చూద్దాం. అమెరికా మార్కెట్‌లో ఈ కార్ స్టార్ట్‌ అయ్యే ధర దాదాపు 30,645 డాలర్లు. అంటే భారతీయ రూపాయల ప్రకారం సుమారు రూ.25.5 లక్షలు. టాప్ వేరియంట్ అయితే దాదాపు 38,950 డాలర్లు అంటే రూ.32.5 లక్షల వరకు ఉండవచ్చు. ఇంకా ఈ కార్ భారతదేశంలో లాంచ్ కాలేదు. కానీ అతి త్వరలోనే మన దేశంలోనూ ఈ బండి కనిపించనుంది.

ఒకసారి మన మార్కెట్లోకి వచ్చిన తరువాత మాత్రం SUV మార్కెట్‌ను హడలెత్తిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మైలేజ్, పర్ఫార్మెన్స్, లుక్స్ అన్నీ కలిపి ఇటువంటి SUV మరొకటి లేదు. ఫ్యూచర్ ను ముందుగానే అంచనా వేసి తయారు చేసిన ఈ RAV4 SUV తో టయోటా మరోసారి తన స్థాయిని రుజువు చేసింది.

ఇక మీరు SUV కొనాలనుకుంటున్నారా? ఫ్యూచర్ రెడీ టెక్నాలజీతో, స్టైల్ తో, లగ్జరీతో, మైలేజ్ తో మిరాకిల్ కార్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ RAV4 ను మీ లిస్టులో తప్పకుండా పెట్టుకోవాలి. మన మార్కెట్లోకి రాగానే ధరలు ఎలా ఉంటాయో, వేరియంట్లు ఎన్ని వస్తాయో అని ఇప్పటికే ఆటో లవర్స్ ఎదురుచూస్తున్నారు. మరి మీరు రెడీనా? ఇప్పుడు కాకపోతే మళ్లీ ఇలాంటి SUV దొరకడం కష్టం!