
iPhone 17 సిరీస్ విడుదలకు ముందు Apple ఫ్యాన్స్‌కు ఒక బంపర్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో ఉన్న iPhone 16 Pro మోడల్స్‌కి భారీ డిస్కౌంట్లు ఇవ్వడం ప్రారంభమైంది. ప్రత్యేకంగా Flipkart మీద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Flipkart GOAT Sale 2025 సందర్భంగా ఈ తగ్గింపు మొదలైంది. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 విడుదల కావడానికి ముందు చివరి అవకాశం అనే భావనలో డిస్కౌంట్‌ను కొనసాగిస్తున్నారు.
iPhone 16 Pro అసలు ధర రూ.1,29,900గా ఉండగా, Flipkart లో ఇది ఇప్పుడు కేవలం రూ.1,09,900కి లభిస్తోంది. అంటే సూటిగా రూ.20,000 తగ్గింపు. ఇక iPhone 16 Pro Max అసలు ధర రూ.1,64,900 కాగా, ఇది ఇప్పుడు రూ.1,54,900కి వస్తోంది. అంటే దీన్ని కూడా రూ.10,000 తక్కువ ధరలో తీసుకోచ్చే అవకాశం. అంతేకాదు, మీరు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడితే అదనంగా రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. కాబట్టి మొత్తం తగ్గింపు రూ.24,000 దాకా పెరుగుతుంది. ఇది iPhone ప్రేమికులకి ఒక్కసారిగా దొరికే ఛాన్స్.మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే, దాని వాల్యూను బట్టి ఇంకా తగ్గింపును పొందవచ్చు. పాత ఫోన్ మంచి పరిస్థితిలో ఉంటే ఇంకాస్త ఎక్కువ తగ్గింపుగా ఫైనల్ ప్రైస్ కనపడుతుంది.
iPhone 16 Proలో 6.3 అంగుళాల Super Retina XDR OLED డిస్ప్లే ఉంటుంది. ఇది చూసే అనుభవాన్ని విపరీతంగా అద్భుతంగా మార్చేస్తుంది. ఇక iPhone 16 Pro Maxలో అయితే 6.9 అంగుళాల పెద్ద డిస్ప్లే ఉంటుంది. వీడియోలు, గేమ్స్, డాక్యుమెంట్లు చూసే వారికి ఇది పెద్ద ప్లస్. ఇరు మోడల్స్‌లోనూ 8GB RAM ఉంటుంది. ప్రాసెసర్‌గా Apple A18 చిప్ వాడారు. ఇది పర్ఫార్మెన్స్ పరంగా టాప్ లెవెల్ అనిపించుకుంటుంది. ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసినా, గేమ్స్ ఆడినా, హీటింగ్ అనేది తక్కువగా ఉంటుంది.
[news_related_post]కెమెరా డిపార్ట్మెంట్లో iPhone ఎప్పటికీ నంబర్ వన్. ఇక iPhone 16 Proలో 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా వైడ్ కెమెరా, 12MP టెలిఫోటో కెమెరా ఉంటాయి. వీటి కలయికతో మీ ఫొటోస్ నేరుగా DSLRతో తీసినట్టే ఫీలింగ్ ఇస్తాయి. ఫ్రంట్ కెమెరా కూడా 12MP ఉండి, వీడియో కాల్స్, సెల్ఫీలకు సూపర్ క్వాలిటీ ఇస్తుంది. మీరు కంటెంట్ క్రియేటర్ అయితే ఈ కెమెరా కాంబినేషన్ మీకు ఉపయోగపడుతుంది.
iPhone 16 Pro Maxలో 4685mAh సామర్థ్యమున్న బ్యాటరీ ఉంటుంది. Pro మోడల్లో 3582mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్లు 25W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. బ్యాటరీ బ్యాకప్ మీద ఎక్కువ పని చేసే వారికి ఇది నిజంగా అవసరం. రోజంతా ఛార్జ్ అయిపోవడం గురించి ఫీలవ్వాల్సిన అవసరం లేదు. ఈ మోడల్స్ మూడు అందమైన రంగుల్లో వస్తున్నాయి – టైటానియం వైట్, టైటానియం డెజర్ట్, టైటానియం బ్లాక్. వీటి లుక్ ప్రీమియంగా ఉండటం వల్ల చూసినవాళ్లకు మీరు ఫోన్ ఏమిటంటేనే నో చెప్పలేరు.
ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఒకసారి iPhone 17 విడుదల అయితే, ఆ డిమాండ్ పెరగడం వల్ల 16 Pro మోడల్ పై తగ్గింపు తగ్గిపోవచ్చు. అలాగే స్టాక్ కూడా త్వరగా అయిపోతుంది.కాబట్టి మీరు కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, ఇప్పుడు ₹1,09,900లో iPhone 16 Pro తీసుకోవడం వల్ల ₹24,000 వరకూ లాభపడతారు. ఇది ఒక ప్రీమియం డివైస్. ఇప్పుడు తీసుకుంటే 2026 వరకు అప్‌గ్రేడ్ అవసరం లేకుండా ఉంటుంది.