ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా సంవత్సరానికి ₹5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేందుకు అవకాశం ఉంది. ఇప్పుడే ఆధార్ కార్డ్ ద్వారా మీరు ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డ్ పొందవచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.
ఆధార్ కార్డ్‌తో ఆయుష్మాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి?
ఇంట్లోనే కూర్చొని ఆయుష్మాన్ కార్డ్ పొందొచ్చు
- మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి.
- అర్హత లిస్టులో మీ పేరు ఉంటే మీరు ఆయుష్మాన్ కార్డ్ పొందవచ్చు.
ఆయుష్మాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి? (స్టెప్ బై స్టెప్ గైడ్)
- మొదటుగా మీ ఫోన్‌లో ఆయుష్మాన్ యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి.
- యాప్‌లో లాగిన్ చేయాలి (OTP ద్వారా వెరిఫికేషన్ చేయాలి).
- మీ వ్యక్తిగత సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి.
- రేషన్ కార్డ్‌తో లింక్ అయిన సభ్యుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- మీ పేరు లిస్ట్‌లో ఉంటే eKYC ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఓపెన్ అయ్యే ఫారంలో వివరాలు సరిగ్గా నింపి, మీ లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి.
- OTP ద్వారా వెరిఫై చేసి, సబ్మిట్ చేయాలి.
- ప్రాసెస్ పూర్తయిన తర్వాత, స్క్రీన్‌పై మీ ఆయుష్మాన్ కార్డ్ కనిపిస్తుంది.
- డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.
ఇప్పుడు అప్లై చేయకపోతే లేటు
మీరు ఆర్హులైతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ₹5 లక్షల ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ పొందే ఛాన్స్ ఉంది. ఇప్పుడే మీ కార్డ్ అప్లై చేయండి.