
మన దేశంలో చాలా మందికి జీవిత బీమా అందుబాటులో ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పేద మధ్యతరగతి ప్రజల వద్ద అలా భారీ మొత్తాలు పెట్టి పాలసీలు తీసుకునే సౌలభ్యం ఉండదు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఎంతో తక్కువ మొత్తంతో జీవిత భద్రత కల్పించే రెండు అద్భుతమైన పథకాలను తీసుకొచ్చింది. అవే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) మరియు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY). ఈ రెండు స్కీమ్స్ ఎంతో తక్కువ ఖర్చుతో పెద్ద బీమా కవర్‌ను కల్పిస్తాయి. ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకం అనుకోని ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత వైకల్యం కలిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రతనిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ పథకం కింద సంవత్సరానికి కేవలం రూ.20 ప్రీమియంగా చెల్లిస్తే చాలు. మీరు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం వస్తే, రూ.2 లక్షల బీమా మొత్తం అందుతుంది. అయితే, పూర్తిగా కాదు కానీ, అర్థ వైకల్యం జరిగితే రూ.1 లక్ష బీమా వస్తుంది. ఈ పథకం ప్రతి సంవత్సరం రిన్యువల్ అవుతుంది.
ఈ స్కీమ్‌లో చేరడానికి మీకు బ్యాంక్ ఖాతా లేదా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత ప్రతి సంవత్సరం ప్రీమియాన్ని ఆటోమెటిక్‌గా డెబిట్ చేస్తారు. స్కీమ్‌లో చేరాలంటే మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లవచ్చు లేదా బ్యాంకు వెబ్సైట్ ద్వారా కూడా రిజిస్టర్ చేయొచ్చు. పోస్టాఫీస్ ఖాతా ఉన్నవారు పోస్టాఫీస్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
[news_related_post]మరొక అద్భుతమైన పథకం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY). ఇది కూడా సంవత్సర కాలం గల జీవిత బీమా పథకం. ఈ స్కీమ్‌లో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు చేరవచ్చు. అయితే, 50 ఏళ్ల లోపు చేరినవారు 55 ఏళ్ల వయసు వరకు ఈ బీమా కొనసాగించుకోవచ్చు. ఈ పథకం కింద ఒక సంవత్సరానికి రూ.436 ప్రీమియంగా చెల్లిస్తే చాలు. ఎలాంటి కారణంతో అయినా మరణం జరిగినప్పుడు రూ.2 లక్షల బీమా మొత్తం కుటుంబ సభ్యులకు అందుతుంది. ఇది చాలా తక్కువ ప్రీమియ్తో చాలా గొప్ప లాభం కలిగించే పథకం.
ఇది కూడా PMSBY లాగే ఆటో డెబిట్ విధానంతో పనిచేస్తుంది. అంటే మీరు ఒక్కసారి రిజిస్టర్ అయితే చాలు, ప్రతి ఏడాది మీ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బు డెబిట్ అవుతుంది.
ఈ రెండు స్కీమ్స్ మధ్యతరగతి, పేద ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. PMSBYలో కేవలం రూ.20తో ప్రమాద బీమా, PMJJBYలో రూ.436తో జీవిత బీమా లభిస్తుంది. బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో భవిష్యత్ కోసం పెద్ద భద్రతను తీసుకోవచ్చు.
ప్రస్తుతం జీవిత బీమా పాలసీలు వేలల్లో ఉంటున్న రోజుల్లో, ఈ రెండు స్కీమ్స్ చిన్న మొత్తానికి పెద్ద భద్రతను అందిస్తున్నాయి. ప్రత్యేకించి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కలిగిన వారు తప్పక ఈ స్కీమ్స్‌ను తీసుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలు ముందస్తుగా చెప్పి రవు. కానీ మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే మన కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడగలము.
రోజుకు ఓ టీ తాగే ఖర్చుతో లేదా ఒక ఆహార పదార్థాన్ని తినే ఖర్చుతో మనం జీవిత బీమా సెక్యూరిటీ పొందొచ్చు. ఈ రెండు స్కీమ్స్‌ను తీసుకోవడం అనేది ఒక పెద్ద నిర్ణయం కాదు, కానీ అది అవసరమైనప్పుడు చాలా పెద్ద మద్దతుగా నిలుస్తుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా, మీ బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ రెండు స్కీమ్స్‌లో కూడా చేరండి. నేడు తీసుకున్న చిన్న నిర్ణయం రేపు మీ కుటుంబానికి పెద్ద భద్రతను ఇస్తుంది.