POMIS స్కీమ్ ప్రత్యేకతలు మరియు లాభాలు
ఈ స్కీమ్ మొత్తం 5 ఏళ్ల కాలానికి అందుబాటులో ఉంటుంది. ఒకసారి పెట్టుబడి పెడితే, వచ్చే 5 సంవత్సరాల పాటు నెలనెలా నిరంతర ఆదాయం వస్తుంది. దీని వల్ల తక్కువ రిస్క్‌తో పాటు మంచి భద్రత లభిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (అక్టోబర్ – డిసెంబర్) కొరకు 7.4% వార్షిక వడ్డీ అందుబాటులో ఉంది. ఇది ఇతర పెట్టుబడి అవకాశాల కంటే మెరుగైన రాబడిని అందించే స్కీమ్‌గా నిలుస్తోంది.
కనీస పెట్టుబడి: ₹1,000. గరిష్ట పెట్టుబడి: ఒకే వ్యక్తి ఖాతాకు ₹9 లక్షలు, జాయింట్ ఖాతాకు ₹15 లక్షలు (జాయింట్ ఖాతాలో 3 మంది వరకు చేరుకోవచ్చు). ₹1,000 మల్టిపుల్స్‌లో డిపాజిట్ చేయాలి.
నెలకు ఎంత ఆదాయం వస్తుంది?
₹9 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు ₹5,550 లభిస్తుంది. ₹15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు ₹9,250 ఆదాయం వస్తుంది.
ఈ ఆదాయం పూర్తిగా భద్రతతో కూడినదిగా ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రభుత్వం మద్దతుగల పథకం.
Related News
పెట్టుబడి చేసేవారికి అదనపు ప్రయోజనాలు
పూర్తిగా సురక్షితమైన పెట్టుబడి – ప్రభుత్వ బ్యాకింగ్ ఉండటం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు. అంతే కాదు, నెలనెలా గ్యారంటీ అయిన ఆదాయం – పెన్షన్ లాంటి స్థిరమైన ఆదాయాన్ని అందించే బెస్ట్ ఆప్షన్. ఖాతా ప్రారంభం సులభతరం – ఏదైనా పోస్ట్ ఆఫీస్‌లో సులభంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.
ముందుగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చా?
ఈ స్కీమ్‌లో డబ్బును 5 సంవత్సరాల ముందు తీయడం సాధ్యమే, కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. 1 సంవత్సరం తర్వాత మాత్రమే ముందుగా విత్‌డ్రా చేయొచ్చు. 5 సంవత్సరాల ముందు తీసుకోవాలంటే కొంత శాతం పెనాల్టీ చెల్లించాలి.
ఎందుకు POMIS స్కీమ్ మంచి ఆప్షన్?
ఈ స్కీమ్ రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం పొందాలనుకునే వారికి అద్భుతమైన పెట్టుబడి ఎంపిక. ఉద్యోగ విరమణ పొందిన వారు, స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు లేదా భద్రతతో కూడిన పెట్టుబడి కోరుకునేవారికి సరైన ఆప్షన్. ఒక్కసారి డబ్బు పెట్టి, నెల నెలా ఆదాయం పొందే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌ను మిస్ కాకండి. మీ భవిష్యత్తును భద్రపరుచుకోవడానికి ఇదే బెస్ట్ ఛాన్స్.