పోస్ట్ ఆఫీస్‌లో కూడా బ్యాంకుల్లానే అద్భుతమైన FD స్కీములు ఉన్నాయి. Post Office Time Deposit (TD) అంటేనే పోస్ట్ ఆఫీస్ FD. 1 నుంచి 5 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితులలో ఈ FDలు అందుబాటులో ఉన్నాయి. అయితే 5 ఏళ్ల FDని స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే మీ డబ్బు 3 రెట్లు పెరుగుతుంది..
₹10 లక్షలకు పైగా ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది?
- ₹5 లక్షలు పెట్టుబడి పెడితే, 7.5% వడ్డీ రేటుతో 5 ఏళ్లకు ₹2,24,974 వడ్డీ వస్తుంది. టోటల్ ₹7,24,974 అవుతుంది.
- దీన్ని మరో 5 ఏళ్లకు పొడిగిస్తే, ₹5,51,175 వడ్డీ వస్తుంది. 10 ఏళ్లకు మొత్తం ₹10,51,175 అవుతుంది.
- మరోసారి పొడిగిస్తే, 15 ఏళ్లకు ₹10,24,149 వడ్డీ వస్తుంది.
- క్లుప్తంగా చెప్పాలంటే, ₹5 లక్షలు FD పెట్టుకుంటే 15 ఏళ్ల తర్వాత మొత్తం ₹15,24,149 మీ అకౌంట్లో ఉంటాయి.
పోస్ట్ ఆఫీస్ FDని పొడిగించడం ఎలా?
- 1-Year FD – 6 నెలల్లోపు పొడిగించాలి.
- 2-Year FD – 12 నెలల్లోపు పొడిగించాలి.
- 3-Year & 5-Year FD – 18 నెలల్లోపు అప్లై చేయాలి.
- అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ అప్షన్ తీసుకోవచ్చు.
- పొడిగించే సమయంలో ఉన్న వడ్డీ రేటు వర్తించుతుంది.
ప్రస్తుత పోస్ట్ ఆఫీస్ FD వడ్డీ రేట్లు:
- 1-Year FD – 6.90%
- 2-Year FD – 7.00%
- 3-Year FD – 7.10%
- 5-Year FD – 7.50%
నోట్: వడ్డీ రేట్లు మారవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్సైట్లో లేదా బ్రాంచ్‌లో ఖచ్చితంగా చెక్ చేయండి.
మీ భవిష్యత్తు సెట్ చేసుకోవాలంటే ఈ FD ట్రిక్ తప్పక పాటించండి.