Gas Cylinder: మారనున్న రూల్స్.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లకు QR కోడ్..

LPG cylinders లకు QR code ఇచ్చే ప్రతిపాదనపై త్వరలో చర్చిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. గ్యాస్ సరఫరాలో అవకతవకలను తగ్గించేందుకు వంటగ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్, ఏజెన్సీల జాబితా నిర్వహణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gas Cylinder Rules GCR లో Gas Cylinder draft QR code  ను పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, గ్యాస్ సరఫరాలో అక్రమాలను తగ్గించేందుకు వంట గ్యాస్ సిలిండర్లను ట్రాక్ చేసేందుకు ఈ క్యూఆర్ కోడ్ ఎంతగానో ఉపయోగపడుతుందని గోయల్ తెలిపారు.

నివాసానికి 30-50 మీటర్ల దూరంలో కూడా పెట్రోల్ పంపులు పనిచేసేలా అవసరమైన భద్రతా చర్యలను రూపొందించాలని పెట్రోలియం అండ్ Explosives Safety Organization  (PESO)ని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను అనుసరించాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ – డీపీఐఐటీ కింద పనిచేస్తున్న PESO, పేలుడు పదార్థాల చట్టం, 1884, పెట్రోలియం చట్టం, 1934 నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం రాయితీ, 50 శాతం రాయితీ ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు. పెసో మంజూరు చేసిన లైసెన్సింగ్ ఫీజులో MSMEల కోసం.

Related News