
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రౌడీ హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేస్తున్నారు.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొన్ని రోజుల్లో కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్స్ హీరోయిన్గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. అయితే, తన సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు, హీరో విజయ్ దేవరకొండ ఆసుపత్రి పాలయ్యారు. డెంగ్యూ జ్వరం కారణంగా ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విజయ్ త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు.