మహిళలు, ముఖ్యంగా యువతులు మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను ఉపయోగిస్తారు. కానీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వాడకం వల్ల భారతదేశంలో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని తాజా సర్వేలో తేలింది. ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల తయారీలో మెర్క్యురీని ఉపయోగిస్తారు. దీని వల్ల మెంబ్రేనస్ నెఫ్రోపతి కేసులు పెరుగుతున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది.
ఈ క్రీములు కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీసి ప్రొటీన్ లీకేజీకి కారణమవుతాయని అంటున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఈ క్రీముల వాడకంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.