విపరీతంగా పెరుగుతున్న ఎండలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

ఎండలు పెరుగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. మూడో తేదీ వరకు అకాల వర్షాలు.. ప్రస్తుతం భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మార్చి 27 నుంచి మార్చి 29 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని.. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు ఉంటాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ నెల 27న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాలు, ఆసిఫాబాద్, పెదపల్లిలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మార్చి 28న వేడి గాలులు వీస్తాయని, తూర్పు, దక్షిణ తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో వేడిగాలులు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు పెరగనున్నాయి. సోమవారం (మార్చి 25) రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండలోని తిమ్మాపూర్‌, భద్రాద్రి కొత్తగూడెంలోని సుజాతనగర్‌లో 40.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో అత్యధికంగా 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది

Related News