ఆంధ్ర ప్రదేశ్ లో వేసవి సెలవులు పొడిగింపు.. AP schools reopens on June 13th.

రాష్ట్రంలో వేసవి సెలవులను ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా, తాజా మార్పుతో 13న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరో రోజు పొడిగించింది.

కాగా, ఎన్డీయే కూటమిలో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. 175 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్లతో అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారు. కేసరపల్లి, గన్నవరం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టారు.

దీని మీద అధికారిక వుతర్వులు  వెలువడాలి .. ఇది అధికారిక ప్రకటన కాదు