మన దేశంలో సమానత్వం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు తీసుకువస్తోంది. వాటిలో చాలా స్కీమ్స్ గురించి చాలా మందికి సరైన సమాచారం ఉండదు. అలాంటి వినూత్నమైన, ఎంతో ఉపయోగకరమైన పథకం ఇది – ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ ప్రమోషన్ స్కీమ్.
ఏం ప్రయోజనాలు
ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం పెళ్లి చేసుకున్న కొన్ని జంటలకు నేరుగా ₹2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇది కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు, సామాజిక స్థాయిని గుర్తించే గొప్ప ప్రోత్సాహక పథకం కూడా.
ఈ పథకం ప్రధానంగా విభిన్న కులాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగే పెళ్లిళ్లను ప్రోత్సహించడానికే రూపొందించబడింది. ఉదాహరణకు, ఒక జనరల్ కేటగిరీకి చెందిన హిందూ వ్యక్తి, ఒక షెడ్యూల్డ్ కాస్ట్ (SC) వ్యక్తిని వివాహం చేసుకుంటే, వారు ఈ స్కీం లబ్ధిదారులుగా అర్హులు అవుతారు. ముఖ్యంగా, ఈ వివాహం హిందూ మ్యారేజ్ యాక్ట్ – 1955 ప్రకారం నమోదవ్వాలి. వివాహం జరిగిన ఒక సంవత్సరం లోపల రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి.
Related News
రెండో పెళ్లి అయితే
అంతే కాకుండా, ఈ పథకాన్ని కేవలం మొదటి వివాహం అయిన జంటలకే వర్తింపజేస్తారు. అంటే, మీరు లేదా మీ జీవిత భాగస్వామి ఇద్దరిలో ఎవ్వరైనా గతంలో పెళ్లి చేసుకుని ఉండి, ఇది రెండో పెళ్లైతే, మీరు ఈ పథకానికి అర్హులు కాలేరు. అదే విధంగా, ఎటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, నిబంధనల ప్రకారం జరిమానా విధించబడుతుంది. మీరు ఇప్పటికే కేంద్రం లేదా రాష్ట్రం నిర్వహించే ఇతర ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందినట్లయితే, ఈ స్కీమ్ నుండి కట్ చేయబడుతారు.
దరఖాస్తు ఎలా
ఈ పథకానికి అప్లై చేయాలంటే, ముందుగా మీరు వివాహ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఇది మొదటి పెళ్లే అనే అఫిడవిట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్లు (భర్త, భార్య ఇద్దరిదీ), మరియు ఇద్దరికి కలిపి ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ డాక్యుమెంట్లను సరిగా సెట్ చేసి, మీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే లేదా ఎంపీకి ఇవ్వవచ్చు. వారు దానిని డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్కి పంపిస్తారు. లేకుంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వ లేదా జిల్లా సర్వేస్ కార్యాలయంకి కూడా డైరెక్ట్‌గా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ ఆమోదం వచ్చిన తర్వాత, మొత్తం ₹2.5 లక్షలు మంజూరు అవుతుంది. అందులో ₹1.5 లక్షలు నేరుగా మీ జాయింట్ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి. మిగిలిన ₹1 లక్షను ప్రభుత్వం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో వేస్తుంది. ఈ ఎఫ్డీని మీరు నిర్దిష్ట వ్యవధి తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఖర్చు చేసే స్వేచ్ఛ కూడా మీకు ఉంటుంది – పెళ్లికి సంబంధించిన అవసరాలు, స్థిర నిక్షేపం, లేదా కుటుంబ అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు.
ఇలాంటి అద్భుతమైన పథకం గురించి చాలామందికి తెలియదు. కేవలం ఒక్క పెళ్లితో ₹2.5 లక్షల బహుమతి లభించే అవకాశం మరెక్కడా ఉండదు. ఇది న్యాయంగా, సామాజికంగా గుర్తింపు ఇచ్చే పథకం. మీరు లేదా మీ పరిచయంలోని ఎవరికైనా ఈ పథకం వర్తిస్తే, వెంటనే అప్లై చేయండి. ₹0 పెట్టుబడి – ₹2.5 లక్షల నికర లాభం మీకు అందుబాటులో ఉంది. మిస్ అయితే మరో అవకాశం ఉండకపోవచ్చు.
ఇప్పుడు అప్లై చేయండి – మీరు వేసే ఒక్క అడుగు మీ జీవితాన్నే మార్చవచ్చు.