ఇప్పుడు పెట్టుబడిదారుల మధ్య ETFs (Exchange Traded Funds) గురించి చాలా చర్చ జరుగుతోంది. కేవలం స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ కాకుండా, ETFs ద్వారా మరింత లాభదాయకమైన మార్గం సిద్ధమైంది. గత 1 ఏళ్లలో కొన్ని ETFs 70% దాకా రిటర్న్స్ ఇచ్చాయి. మరి, ETFs అంటే ఏమిటి? అందులో పెట్టుబడి ఎలా పెట్టాలి? చూద్దాం.
ETFs అంటే ఏమిటి?
ETFs అంటే Exchange Traded Funds, ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్ లాంటివే. వీటిని మీరు స్టాక్స్‌లా లైవ్ మార్కెట్‌లో కొనుగోలు/అమ్మకం చేయవచ్చు. సాధారణ మ్యూచువల్ ఫండ్స్ రోజుకు ఒక సారి NAV ప్రకారం ట్రేడ్ అవుతాయి, కానీ ETFs ప్రైస్ మార్కెట్ సమయంలో మారుతూ ఉంటుంది.
ETFs ఎందుకు పాపులర్ అయ్యాయి?
- తక్కువ ఖర్చులు – మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో.
- లైవ్ ట్రేడింగ్ – స్టాక్స్‌లా మార్కెట్ సమయంలో కొనుగోలు/అమ్మకం చేయొచ్చు.
- డైవర్సిఫికేషన్ – ఒక్క ETF లోనే 50+ స్టాక్స్ ఉండొచ్చు.
- హై రిటర్న్స్ – కొన్ని టెక్ ETFs 1 ఏల్లో 70% వరకు రాబట్టాయి
ETFs లో పెట్టుబడి ఎలా పెట్టాలి?
- Demat Account ఓపెన్ చేయాలి. (Zerodha, Groww, HDFC Securities వంటివి ఉపయోగించొచ్చు)
- కూడదని అనుకునే మార్కెట్ సెక్టార్ ఆధారంగా ETFs ఎంపిక చేసుకోండి (Tech, Gold, Nifty ETFs)
- స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయంలో ETFs కొనండి.
- దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందే అవకాశం!
ETFs ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఫేవరేట్ ఆప్షన్. 1 ఏళ్లలో 70% రిటర్న్స్ వచ్చిన ETFs కూడా ఉన్నాయి. ఈ అవకాశం మిస్ కాకండి.