రూ.55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. కిలోమీటర్‌ కు ఒక్క రూపాయి మాత్రమే !

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే ఇది ఎలాంటి స్కూటర్ అని మీరు అనుకుంటున్నారు? Bounce Infinity ఇటీవల మార్కెట్లోకి కొత్త ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. దీని రేటు అందుబాటులో ఉంది. ఫీచర్లు అదుర్స్. కంపెనీ కొత్తగా విడుదల చేసిన మోడల్ పేరు E1X. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 55 వేల నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ట ధర రూ. 59 వేలు. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇన్ఫినిటీ E1X ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. కిలోమీటరుకు రూ.1 నుంచి రూ.1.5 ఖర్చు కావచ్చు. బెంగళూరుకు చెందిన ఈ EV తయారీ కంపెనీ బ్యాటరీ మార్పిడి ఫీచర్‌తో ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త స్కూటర్ విక్రయాలు జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్యాటరీ మార్పిడి నెట్‌వర్క్‌కు అనుగుణంగా ఈ మోడల్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

Related News

కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. రెండవ వేరియంట్ వేగం గంటకు 65 కిలోమీటర్లు. అలాగే ఇందులో మరో కొత్త మోడల్‌ను కంపెనీ తీసుకురానుంది. దీని గరిష్ట వేగం గంటకు 92 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఇతర ఫీచర్లు తెలియాల్సి ఉంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.

బ్యాటరీ స్వాపింగ్ ఫీచర్ వాహనదారులకు ఊరటనిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు స్వాపింగ్ స్టేషన్‌కి వెళ్లి మీ బ్యాటరీని ఇస్తే… పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీని స్కూటర్‌లో ఉంచుకోవచ్చు. దీని అర్థం ఛార్జింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ప్రయాణం సులువవుతుందని చెప్పొచ్చు. ఈ ఫీచర్‌ను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఇప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేసింది. చాలా కంపెనీలు మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటి రేటు ఎక్కువ అని చెప్పొచ్చు. ఓలా, టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి అనేక కంపెనీలు మార్కెట్‌లో విక్రయాలను కొనసాగిస్తున్నాయి. కానీ ఈ కంపెనీల స్కూటర్లతో పోలిస్తే.. కొత్తగా విడుదల చేసిన బౌన్స్ ఇన్ఫినిటీ మోడల్ ధరలు తక్కువగా ఉండటం గమనార్హం.