హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ ఆటోలను తయారు చేసేందుకు టీవీఎస్ మోటార్‌తో చేతులు కలపాలని చూస్తోంది. ఈ జాయింట్ వెంచర్‌లో ఆటోల తయారీని టీవీఎస్ చూసుకుంటుందని, డిజైన్ మరియు టెక్నాలజీని హ్యుందాయ్ చూసుకుంటుందని సంబంధిత వ్యక్తులు వివరించారు. ఈ వాహనాలను భారతదేశంలోనే తయారు చేయనున్నారు.
టీవీఎస్ కాంట్రాక్ట్ తయారీ కంపెనీగా కూడా పనిచేసే అవకాశం ఉంది. చిన్న వాహనాలకు సంబంధించిన టెక్నాలజీని హ్యుందాయ్ గ్రూప్ టీవీఎస్‌తో పంచుకోనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటుపై హ్యుందాయ్ మరియు టీవీఎస్ స్పందించలేదు.
రాబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ క్రెటా మోడల్ మరియు ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మోడల్‌ను కూడా ప్రదర్శిస్తుంది. మరోవైపు టీవీఎస్ కూడా ఈ ఏడాది తన సొంత ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. రైడ్-పూలింగ్ సేవలను (షేరింగ్ క్యాబ్‌లు) అందించడానికి హ్యుందాయ్ తన యాప్ షక్ల్‌ను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ యాప్ దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంది.