Elections Breaking news: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవ.. పోలింగ్ ఏజెంట్లకు తీవ్ర గాయాలు

ఏపీలో ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లాలోని రెంటచింతల రెండు మండలాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ క్రమంలో ముగ్గురు టీడీపీ పోలింగ్ ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరిని కూర్చోబెట్టారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత సాధారణ పోలింగ్ ప్రారంభం కాగానే ఘర్షణ జరిగినట్లు సమాచారం.

దీంతో రెంటాల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. అలాగే కడప జిల్లా కమలాపురం మండలం కోగట్టంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టారని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలను ప్రశాంతంగా ముగించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.