హైస్కూల్ ప్లస్ పాఠశాలల కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పాఠశాల విద్యా కమిషనర్ వి. విజయరామరాజు తెలిపారు.
శుక్రవారం మంగళగిరిలోని విద్యా భవన్‌లో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. హైస్కూల్ లలో ఆటలు మరియు కార్యక్రమాల నిర్వహణకు వారిని బయటకు పంపకూడదని ఆయన ఆదేశించారు. మిగులు ఉపాధ్యాయులు మరియు భాషా పండితుల పదోన్నతులపై కూడా సమావేశంలో చర్చించారు.
ప్రస్తుతం జరుగుతున్న కొత్త స్కూల్ కాంప్లెక్స్ క్లస్టర్లు మరియు మోడల్ పాఠశాలల ఏర్పాటు పై మీటింగ్ లో చర్చించడం జరిగింది.. 117 జీవో వెనక్కి తెచ్చే క్రమం లో అందరి నుంచి అభిప్రాల సేకరణ మరియు ప్రత్యామ్న్యాయ పద్ధతుల కొరకు చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు