Leading electronics giant Motorolo launched a new phone in the Indian market on Thursday . Motorola Edge 50 Fusion పేరుతో ఈ ఫోన్ని తీసుకొచ్చింది. Flipkart తో పాటు కంపెనీ అధికారిక website లో ఈ నెల 22 నుంచి ఇది అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే, ఇది 6.67-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంది. తక్కువ బడ్జెట్లో ఇటువంటి స్క్రీన్ను అందించే కొన్ని ఫోన్లలో ఇది ఒకటి. Motorola Edge 50 Fusion Android 14 operating system పై రన్ అవుతుంది.
Smartphone 68W Turbo Power charging కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 12 GB RAM మరియు 256 GB ఇంబిల్ట్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది.
Related News
కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్లో 50 megapixels లతో కూడిన సోనీ ఎల్విటి 700 సి సెన్సార్ కెమెరా ఉంది. ఇది సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. 1600 nits peak brightness, Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్ అందించబడింది.
ధర విషయానికొస్తే, 128GB storage variant తో 8GB RAM రూ. 22,999కి మరియు 12GB RAMతో 256GB storage variant రూ.24,999కి అందుబాటులో ఉంది. అలాగే వివిధ బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2000 తగ్గింపు లభిస్తుంది. హాట్ పింక్, మార్ష్మల్లౌ బ్లూ, పీఎంఎంఏ ఫినిషింగ్ మరియు Forest Blue colors లలో ఫోన్ అందుబాటులో ఉంది.