మన తీసుకునే ఆహార మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా కూరగాయలు, పండ్లు తీసుకుంటాము. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అయితే మారుతున్న జీవనశైలి, ఇతర కారణాలవల్ల కావాల్సిన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాము. ఈ క్రమంలో ఆరోగ్యంపై చాలా ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా అనేక సమస్యలు కూడా వస్తాయి. పడుకుందామన్న కూడా నిద్ర కూడా పట్టదు. అయితే ఈరోజు మనం సులభంగా నిద్రపోవడానికి కొన్ని ఆహారాలు తీసుకుంటే నిద్ర పడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కివి పండ్లు
కివి పండు తింటే ఒత్తిడి తగ్గుతుంది. ఇవి తింటే సిరాటోనిన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో మన మనసు రిఫ్రెష్ అయ్యి బాగా నిద్ర పడుతుంది. ఈ పండ్లు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి.
Related News
అరటిపండు
బజార్ లో సులభంగా దొరికే అరటిపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మెలటోనిన్, సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి మెదడుకి విశ్రాంతిని అందిస్తాయి. దీంతో ఎన్ని సమస్యలు ఉన్నా అరటి పండు తింటే నిద్ర బాగా పడుతుంది.
తేనె
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తేనెను అనేక విధాలుగా తీసుకోవచ్చు. నేను తింటే నిద్రలేమి సమస్యలు రావు.
పాలు
పాలలో టట్రిప్టో పాన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రోజు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీడిని తీసుకోవడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది
ఆముదం
త్వరగా నిద్రపోవడానికి ఆముదం ఎంతో ఉపయోగపడుతుంది. పడుకునే ముందు కనురెప్పల మీద కొంచెం ఆముదం నూనె అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది
చెర్రీ రసం
అందరూ ఇష్టపడే చర్య రసంలో మెలటోనిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో నిద్ర రానివారు ఒక్క గ్లాస్ చెర్రీ రసం తాగితే ఇట్టే నిద్రపోతారు.