Earthquake: ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు.. జనాలు పరుగులు.. ఎక్కడంటే?

ప్రకాశం : ఏపీలో మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. ఈరోజు (శనివారం) దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు వచ్చాయి. దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, కురిచేడు మండలాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇదిలా ఉండగా.. డిసెంబర్ 4న ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొద్దిసేపు భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7.20 గంటలకు కొన్ని సెకన్లపాటు ఈ పరిస్థితి తలెత్తింది. తెలంగాణలోని ములుగు జిల్లాను భూకంప కేంద్రంగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఈ ప్రకంపనలు భూమి యొక్క బేస్ నుండి 200-300 కిలోమీటర్ల దూరంలో గుర్తించబడ్డాయి. రిక్టర్ స్కేలుపై ఇది 5.3గా నమోదైంది.

కొద్ది రోజుల క్రితం..

Related News

గతంలో.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశాన్ని ఐదు జోన్లుగా విభజించింది. జోన్-2లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ములుగులో భూకంపం ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై పడింది. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ నగరం, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోల్, నందిగామ, కంచికచెర్ల, వీరులపాడు మండలాల్లో ప్రకంపనలు వచ్చాయి. తిరువూరు మండలం రాజుపేటలో ఈ ప్రకంపనలకు ఇళ్ల గోడలు బీటలు వారాయి. సీసీటీవీ కెమెరాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. కొన్ని చోట్ల ప్రజలు భయంతో పరుగులు తీశారు. గంపలగూడెంలో గోడలపై కుండలు పడిపోయాయి. హనుమాన్ జంక్షన్‌లోని ఓ వీధిలో భూమి కంపించినట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది.

అంత ప్రమాదకరమైనది కాదు: శాస్త్రవేత్తలు

అయితే గతంలో ఈ ప్రకంపనలు రావడంతో జిల్లాలోని తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే కాసేపటి తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రకంపనలకు భయపడాల్సిన అవసరం లేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా.. భూకంపాలు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. జోన్-2లోని ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని భౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఇదే పరిస్థితి వస్తుందని వారు వెల్లడిస్తున్నారు. జోన్-2లో రిక్టర్ స్కేలుపై 6-6.05కి మించి భూమి ఎప్పుడూ కంపించదని వారు చెబుతున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *