మన జీవితంలో ఎప్పుడైనా అనుకోని ఖర్చులు వస్తాయి – హఠాత్తుగా జాబ్ పోయినా, హాస్పిటల్ బిల్స్ వచ్చినా, వ్యాపారంలో నష్టం వచ్చినా డబ్బు అవసరమవుతుంది. అలాంటి సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే మనం ఎవరికీ అర్థిక సహాయం అడగాల్సిన అవసరం ఉండదు.
ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి?
ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఆవసరమైన సమయంలో ఉపయోగించేందుకు ముందుగా దాచుకున్న డబ్బు. ఇది మినిమమ్ 6 నెలల ఖర్చులకు సరిపడేలా ఉండాలి. అంటే, మీరు నెలకు ₹30,000 ఖర్చు చేస్తుంటే, కనీసం ₹1.80 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్‌గా దాచుకోవాలి.
ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు అవసరం?
- హఠాత్తుగా ఉద్యోగం పోయినా ఖర్చులు నిర్వహించడానికి
- ఆరోగ్య సమస్యలు వచ్చినా హాస్పిటల్ ఖర్చులు భరించడానికి
- ఒకేసారి పెద్ద ఖర్చు వచ్చినా అప్పుల బాధ లేకుండా ఉండడానికి
- కుటుంబ భద్రత కోసం, ప్రత్యేకించి పిల్లల భవిష్యత్తు రక్షించడానికి
ఎక్కడ దాచాలి?
ఎమర్జెన్సీ ఫండ్ సురక్షితంగా ఉండాలి, కానీ అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేలా కూడా ఉండాలి.
- సేవింగ్ అకౌంట్ – తక్కువ వడ్డీ వస్తుంది, కానీ ఎప్పుడైనా వాడుకోవచ్చు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) – మంచి వడ్డీతో సురక్షితంగా ఉంటుంది.
- లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ – బ్యాంకు FD కంటే హయ్యర్ రిటర్న్స్ వస్తాయి, 24 గంటల్లోనే విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇప్పుడే ఎమర్జెన్సీ ఫండ్ సృష్టించుకోండి… లేకుంటే అవసరమైన సమయంలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొదలు పెట్టండి.