Donald Trump’s Swearing-in Ceremony: నేడే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. వివరాలు ఇవే !

భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కాపిటల్ హిల్‌లోని రోటుండాలో జరగనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేశ, విదేశాల నుండి విదేశీ ప్రతినిధులు, అతిథులు పాల్గొననున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ భారతదేశం నుండి అధికారికంగా పాల్గొననుండగా.. అంబానీ దంపతులకు ప్రత్యేక ఆహ్వానం అందడం చర్చనీయాంశంగా మారింది.

ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రత్యేక సంగీత ప్రదర్శనలు, కవాతులు జరగనున్నాయి. సుదీర్ఘ వేడుకలు జరగనున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత.. ట్రంప్ పాలన వెంటనే ప్రారంభం కానుంది. ట్రంప్ దాదాపు 100 విభిన్న అంశాలపై ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత సాయంత్రం జరిగే సరదా కార్యక్రమాల్లో ట్రంప్ పాల్గొంటారు.

భారీ మద్దతుదారులు:

ఈసారి ఇండోర్‌లో వేడుకలు జరుగుతున్నందున, కొద్దిమంది మాత్రమే ఈ వేడుకల్లో నేరుగా పాల్గొంటారు. మిగతా వారందరూ.. అమెరికాలో ఎక్కడో ఒకచోట జరిగే వేడుకల్లో పాల్గొంటారు.. అయితే.. ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ డిసికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జనం రద్దీ పెరుగుతోంది. ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ వన్ అరీనా దగ్గర పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

ముందుగానే వేడుకలు:

ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందే.. వర్జీనియాలో వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి, ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి తన గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.. వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. వారు మెలానియాతో కలిసి నృత్యం కూడా చేశారు. ఆ తర్వాత, వారు ఒక సంగీత ప్రదర్శనను ఆస్వాదించారు. వారు సంతోషంగా అమెరికన్ ప్రసిద్ధ పాటలను విన్నారు. పారిశ్రామికవేత్తలు, టెక్ దిగ్గజాలు, వ్యాపారవేత్తలు మరియు సుమారు 100 మంది ఈ వేడుకలలో పాల్గొన్నారు. వారిలో ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *