కారు నడపడంలో మీరు ఎంత నిపుణులైనా రోడ్డుపై ప్రమాదాలు ఎప్పుడైనా జరుగుతాయి. అటువంటి సమయంలో మీకు, మీ కారు ఖర్చులకు కవరేజ్ కల్పించే బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండటం చాలా అవసరం. అంతేకాకుండా, సెలవేటర్లు, సహజ విపత్తులు, ఇతర అనుకోని ఘటనలు వల్ల కారు డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ వల్ల మంచి రక్షణ పొందొచ్చు.
కారు నడపేటప్పుడు ఈ తప్పులు చేయకండి
రోడ్ రూల్స్ పాటించకపోతే ఫైన్ పడుతుంది..సీట్బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయడం, వాహనానికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ లేకపోవడం, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల భారీ జరిమానాలు పడొచ్చు..కారుకు ఇన్సూరెన్స్ లేకుంటే కూడా జరిమానా పడే అవకాశం ఉంది.
బెస్ట్ కార్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడానికి 4 ముఖ్యమైన టిప్స్
1. IDV (Insured Declared Value) చెక్ చేయండి
ఇది చాలా కీలకం… మీ కారు చోరీకి గురైనా, పూర్తిగా నాశనం అయినా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు చెల్లించే మొత్తాన్ని IDV ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి, మీ కారుకు సరైన IDV ఉండేలా చూసుకోవాలి.
Related News
2. ఇన్సూరెన్స్ కవరేజీ పక్కాగా తెలుసుకోవాలి
మీ పాలసీలో ఏం కవరేజ్ ఉంది?
అపఘాతం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఎంత వరకూ కవరేజ్ ఇస్తుంది?చోరీ జరిగినా, సహజ విపత్తుల వల్ల నష్టమొచ్చినా రక్షణ ఉంటుందా?ఈ డిటైల్స్ బాగా చదివి అర్థం చేసుకోవాలి.