₹12 లక్షల జీతం ఉంటే ₹6 లక్షల కారు సరిపోతుందా? 50:20:04 రూల్ ఏమంటుంది…

ఇప్పుడు రోజుకో కొత్త కారు డ్రీమ్ కార్ అవుతోంది. స్టైల్‌గా ఉండాలని, ట్రావెలింగ్ సౌకర్యంగా ఉండాలనే కోరికతో చాలామంది కారు కొనాలనుకుంటున్నారు. కానీ ఏ కారు కావాలి అనే ఆలోచన కంటే ముందు, “ఎంత ఖర్చు చేయగలుగుతాం?”, “EMI మోయగలమా?” అనే ప్రశ్నలపై కాస్త గమనిస్తేనే ఫైనాన్షియల్‌గా భద్రత ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ రోజుల్లో ఇల్లు కానీ, కారు కానీ, ఎక్కువ మంది లోన్ తీసుకునే మాధ్యమంగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా లక్షల రూపాయలు వెచ్చించడం సాధ్యం కాదు. కానీ లోన్ తీసుకున్న తర్వాతే అసలైన సమస్య మొదలవుతుంది. భారీ EMIల వల్ల ప్రతి నెలా జీతంలో ఎక్కువ భాగం లోన్‌కి వెళ్తుంది. పర్సనల్ ఖర్చులు, ఫ్యామిలీ అవసరాలు అన్నీ కలిపి చివరకు టెన్షనే మిగులుతుంది.

50:20:04 రూల్

ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండాలంటే ఒక సింపుల్ గైడ్‌ని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. దాన్ని 50:20:04 రూల్ అంటారు. ఈ మూడు సంఖ్యల వెనుక ఉన్న అర్థం తెలుసుకుంటే, మీరు ఓ స్మార్ట్ బయర్ గా మారిపోతారు.

Related News

 

1. 50 % లోపలే

ఆదాయానికి 50% లోపలే కార్ ఖరీదు ఉండాలి
మీ జీతాన్ని బేస్ చేసుకుని కారు ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఏడాది జీతం ₹12 లక్షలు అయితే, మీరు కొనబోయే కారు ఖరీదు ₹6 లక్షలు దాటి పోకూడదు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పెట్టుబడి వేస్తే, నెలవారీ EMIలు ఎక్కువగా వస్తాయి. మిగతా అవసరాలపై ఖర్చు పెట్టడం కష్టం అవుతుంది. అందుకే, బడ్జెట్‌కు తగిన కార్ ఎంపిక చేసుకోవాలి.

2. 20 – కనీసం 20% డౌన్ పేమెంట్ చేయాలి

కారు మొత్తంపై కనీసం 20 శాతం డబ్బు డౌన్ పేమెంట్ చేయడం చాలా అవసరం. ఉదాహరణకి, ₹6 లక్షల కారు అయితే, కనీసం ₹1.2 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి. దీని వల్ల మీరు తీసుకునే లోన్ మొత్తం తగ్గుతుంది. అదే విధంగా EMI కూడా manageable గా ఉంటుంది. అందుకే ముందుగానే ఈ డబ్బును సేవ్ చేయడం మంచిది.

3. 04 – సంవత్సరాలే టైం

4 సంవత్సరాల్లో లోన్ పూర్తయ్యేలా ప్లాన్ చేయండి
EMIలు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది 6–7 ఏళ్ల లోన్ తీసుకుంటారు. కానీ దీని వల్ల వడ్డీ మొత్తాలు బాగా పెరిగిపోతాయి. దీన్ని తక్కువ చేసి 4 ఏళ్లలో లోన్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తే, మీరు వడ్డీకి ఎక్కువ డబ్బు పోగొట్టుకోరు. అంతేకాకుండా, త్వరగా లోన్ క్లీన్ అవుతుంది.

మొత్తంగా చెప్పాలంటే

కారు కొనడం ఓ డ్రీమ్ అయితే, ఆ డ్రీమ్ బాధగా మారకూడదు. మీరు 50:20:04 రూల్ పాటిస్తే, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది కానీ ఆర్థిక ఒత్తిడిగా మారదు. ఫ్యామిలీ అవసరాలు, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నింటినీ బలాన్సింగ్ చేయగలుగుతారు. కాబట్టి కొత్త కార్ ప్లాన్ చేస్తే ముందు ఈ మూడు నంబర్లను గుర్తుంచుకోండి – 50:20:04. ఇవే మీ ఫైనాన్షియల్ సక్సెస్‌కి బేస్ అవుతాయి.